Mahindra XUV 7XO లాంచ్.. వేరియంట్ వారీగా పూర్తి వివరాలు

భారతీయ ఎస్‌యూవీ (SUV) దిగ్గజలలో ఒక్కటైనా మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ మోడల్ XUV700 అప్డేటెడ్గా XUV 7XOని మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చిన ఈ కారు ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ప్రారంభ ధరను రూ. 13.66 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 24.11 లక్షల వరకు ఉంది. అయితే ఈ ప్రత్యేక ధరలు కేవలం మొదటి 40,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.


ఈ ఎస్‌యూవీ మొత్తం ఆరు ట్రిమ్ లెవల్స్‌లో లభిస్తుంది.. మహీంద్రా XUV 7XO ధరల వివరాలను వేరియంట్ల వారీగా పరిశీలిస్తే, వినియోగదారులకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. బేస్ వేరియంట్ అయిన AX (7-సీటర్) పెట్రోల్ మాన్యువల్ రూ. 13.66 లక్షల వద్ద లభిస్తుండగా, డీజిల్ మాన్యువల్ ధర రూ. 14.96 లక్షలుగా ఉంది. AX3 వేరియంట్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్ రూ. 16.02 లక్షలు, ఆటోమేటిక్ రూ. 17.47 లక్షలుగా ఉండగా, డీజిల్ మాన్యువల్ రూ. 16.49 లక్షలు, ఆటోమేటిక్ రూ. 17.94 లక్షలుగా నిర్ణయించారు. AX5 వేరియంట్ ధరలు రూ. 17.52 లక్షల (పెట్రోల్ మాన్యువల్) నుండి రూ. 19.44 లక్షల (డీజిల్ ఆటోమేటిక్) మధ్య ఉన్నాయి.

ఇక ప్రీమియం ఫీచర్లు కలిగిన AX7 వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ రూ. 18.48 లక్షలు, ఆటోమేటిక్ రూ. 19.93 లక్షలుగా ఉండగా, డీజిల్ మాన్యువల్ రూ. 18.95 లక్షలు, ఆటోమేటిక్ రూ. 20.40 లక్షలకు లభిస్తోంది. హై-టెక్ ఫీచర్లు ఉన్న AX7T వేరియంట్‌లో పెట్రోల్ ఆటోమేటిక్ రూ. 21.97 లక్షలు, డీజిల్ మాన్యువల్ రూ. 20.99 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్ రూ. 22.44 లక్షలుగా ఉంది. ప్రత్యేకంగా ఇందులో AWD (ఆల్ వీల్ డ్రైవ్) వెర్షన్ రూ. 23.44 లక్షలకు అందుబాటులో ఉంది. ఇక టాప్-ఎండ్ లగ్జరీ వేరియంట్ AX7L ధరలు రూ. 22.47 లక్షల (డీజిల్ మాన్యువల్) నుండి ప్రారంభమై, అత్యున్నత శ్రేణి డీజిల్ ఆటోమేటిక్ AWD మోడల్ రూ. 24.92 లక్షల వరకు ఉన్నాయి.

XUV 7XO రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. అందులో ఒకటి 2.0 లీటర్ టర్బో పెట్రోల్ (mStallion). ఇది 203 hp పవర్‌ను, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండోది 2.2 లీటర్ డీజిల్ (mHawk). ఇది 185 hp పవర్‌ను ఇస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 420 Nm టార్క్, ఆటోమేటిక్ వెర్షన్‌లో 450 Nm టార్క్‌ను అందిస్తుంది.

టెక్నాలజీ పరంగా XUV 7XO కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. కారులో కోస్ట్-టు-కోస్ట్ ట్రిపుల్ 10.25-ఇంచ్ HD డిస్ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, అమెజాన్ అలెక్సా ఇంటిగ్రేషన్ (60+ ఫంక్షన్లు), పనోరమిక్ స్కైరూఫ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, లెథరెట్ సీట్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, కెమెరా సిస్టమ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, డైనమిక్ డాంపింగ్‌తో కూడిన ఇండిపెండెంట్ సస్పెన్షన్. ఇక R18 డైమండ్-కట్ అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.