చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్ల పడిపోతుంది. ఇది ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్య. చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు తెల్లబడే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
ఇక తెల్ల జుట్టు సమస్య వచ్చినవారు మార్కెట్లో దొరికిన రకరకాల రంగులను వినియోగిస్తూ జుట్టు రంగును మారుస్తున్నారు. అయితే జుట్టు రంగు మార్చడానికి మార్కెట్లో దొరికే కలర్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు.
జుట్టు కోసం ఇంట్లోనే తయారు చేసుకునే ఆయిల్
ఇంట్లోనే ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ తయారు చేసుకుని దానిని ఒక క్రమ పద్ధతిలో వాడితే మంచి రిజల్ట్స్ ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. జుట్టు నల్లబడటానికి మనం ఇంట్లోనే కొన్ని వస్తువులతో ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు. జుట్టును నల్లబరిచే ఆయిల్ తయారు చేసుకోవడానికి మనకు కరివేపాకు, ఎండిపోయిన ఉసిరికాయ ముక్కలు లేదా ఉసిరి పొడి, బృంగరాజ్, కొబ్బరి నూనె కావాలి.
వీటితో జుట్టు నల్లబడే ఆయిల్
ముందుగా కొబ్బరి నూనెను తీసుకొని అందులో ఉసిరి పొడి, బృంగరాజ్ చూర్ణం, కరివేపాకు పొడి వేసి నూనెను బాగా మరిగించాలి. కరివేపాకు, బృంగరాజ్, ఉసిరి లోని జుట్టుకు మేలు చేసే మంచి గుణాలన్నీ నూనెలోకి దిగుతాయి. ఆ తర్వాత దీనిని వడపోసి బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను తలకు రాసుకుని, ఉదయాన తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కుదుళ్ల నుండి జుట్టు నల్లబడుతుంది.
నూనెలో ఇవి కూడా యాడ్ చెయ్యండి
జుట్టుకు నూనెను అప్లై చేసుకునే ముందు కాస్త గోరువెచ్చగా చేసి అప్లై చేస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో ఉసిరి ఎంతో బాగా పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు తగిన పోషణ ను ఇచ్చి జుట్టు రంగును పునరుద్ధరిస్తాయి. కరివేపాకులో మెలనిన్ ఉంటుంది. విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్ళు తెల్లబడకుండా కాపాడుతుంది.
వీటితో తెల్ల జుట్టు నల్లగా
కరివేపాకులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇక బృంగరాజ్ లో జుట్టుకు మేలు చేసే ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, చుండ్రును తగ్గించడానికి, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బృంగరాజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ నూనె తయారు చేసుకుని వాడండి
కొబ్బరి నూనెలో జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. కొబ్బరి నూనె జుట్టును హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, లారిక్ ఆమ్లం జుట్టుకు మేలు చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వీటితో తయారుచేసిన ఈ నూనె మీ తెల్ల జుట్టును నల్లబరచటమే కాకుండా, జుట్టు బాగా పెరగడానికి కూడా దోహదం చేస్తుంది.
































