ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి, లవర్‌తో అత్యాచారం చేయించి వీడియో తీసిన యువతి

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతి దారుణ అత్యాచారానికి గురైంది. పార్టీ పేరుతో మద్యం తాగించి, ప్రియుడితో అత్యాచారం చేయించి, వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసింది. ఇద్దరు యువకులు కూడా అత్యాచారంలో పాల్గొన్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.


స్నేహం ముసుగులో మోసాలు చేస్తారని విన్నాం కానీ, మరీ ఇంత నీచానికి దిగజారిపోతారని ఇప్పుడే తెలుస్తోంది. అసలు ఏ మాత్రం భయం లేకుండా, తప్పు చేస్తామనే ఇంకితం లేకుండా ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసింది మరో యువతి. స్నేహం పేరుగా మంచిగా నటించి, ఓ రోజు ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచింది. పార్టీ చేసుకుందామంటూ ఆమెతో బలవంతంగా మద్యం తాగించి, మత్తు ఎక్కిన తర్వాత తన ప్రియుడితో ఆమెపై అత్యాచరం చేయించింది. ఆ దారుణాన్ని వీడియో కూడా తీసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఓ యువతిపై ఆమె స్నేహితురాలు దారుణానికి ఒడిగట్టింది.

పార్టీ చేసుకుందామని ఇంటికి పిలిచి, బలవంతంగా మద్యం తాగించి తన ప్రియుడు ప్రమోద్‌తో ఆమె అత్యాచారం చేయించింది. ఆ దృశ్యాలను వీడియో తీసి తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. బాధితురాలని హుజూరాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపానికి తీసుకెళ్లింది. మళ్లీ మద్యం తాగించి ఈ సారి ప్రమోద్‌తో పాటు అతని స్నేహితుడు హరీశ్‌ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తులో ఉన్న సదరు యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలోనే బాధితురాలి ప్రైవేటు వీడియోలు, ఫొటోలు తీశారు.

విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి ఇంటి వద్ద వదిలిపెట్టారు. అయితే ప్రైవేటు వీడియోలు తీసిన కామాంధులు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తాము ఫోన్ చేసి పిలిచినప్పుడల్లా రావాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. రాకపోతే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ భయపెట్టారు. వారి బెదిరింపులతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో యువతిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.