మఖానా (Makhana), లేదా ఫాక్స్ నట్స్ (Fox Nuts), అనేది లోటస్ సీడ్స్ (Lotus Seeds) నుంచి తయారయ్యే పోషకాహారంతో నిండిన చిరుతిండిగా పరిగణించబడుతుంది. ఇది భారతీయ ఆహారపద్ధతిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ముఖ్యంగా ఆయుర్వేదం మరియు యోగిక్ డైట్ లో మఖానా ఒక సూపర్ ఫుడ్‌గా ప్రాచుర్యం పొందింది. ఈ ఆకారం తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్, మంచి ఫైబర్, మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది. మఖానా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో రక్తపోటును నియంత్రించడం కూడా ఒకటి. అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి ఇది మంచి సహాయకారక ఆహారంగా సూచించబడుతుంది.
రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది: మఖానాలో పోటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి, పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, బ్లడ్ ప్రెజర్ నియంత్రణ లో సహాయపడుతుంది. అధిక సోడియం కలిగిన ఆహారాలను తగ్గించి, పొటాషియం అధికంగా ఉన్న మఖానా వంటి ఆహారాలను తీసుకుంటే హైపర్‌టెన్షన్ (Hypertension) నియంత్రణలో ఉంటుంది. మఖానా కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు & ఫ్లేవనాయిడ్లు ఉండటంతో గుండెకు మేలుచేస్తుంది. అధిక రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం, కాబట్టి మఖానా తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
డయాబెటీస్ నియంత్రణ: మఖానాలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ (Low Glycemic Index) కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు దీన్ని స్వల్ప మోతాదులో తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల మఖానా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది పొట్ట నిండిన భావన కలిగించడంతో జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరచడం వల్ల కొవ్వును త్వరగా కరుగించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: మఖానాలో అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో టాక్సిన్లు (Toxins) బయటికి వెళ్లి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గించడం మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. హార్మోన్ల సమతుల్యత & ఫెర్టిలిటీ మెరుగుదల మఖానాలో ఫైటోన్యూట్రియంట్లు (Phytonutrients) ఉండటంతో హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. పురుషుల & స్త్రీల ఫెర్టిలిటీ మెరుగుపరిచే గుణాలు మఖానాలో ఉన్నాయి. ఇది PCOS (Polycystic Ovary Syndrome) సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది: మఖానాలో మెగ్నీషియం, కాల్షియం, మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మెదడు పనితీరును బలపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన (Anxiety), మూడ్ స్వింగ్స్ తగ్గించడానికి మఖానా మంచిది. అయితే రోజుకు 30-50 గ్రాముల మఖానా తీసుకోవడం ఉత్తమం. రోస్టెడ్ మఖానా తినవచ్చు.దీనిలో బాదం, నేరేడు, మరియు తేనెతో కలిపి తీసుకోవచ్చు. సూప్స్, కర్రీలు, కీచడిలో ఉపయోగించవచ్చు. మఖానా పౌడర్ పాలలో కలిపి తీసుకోవచ్చు.