మారిన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలను సైతం పెంచుకోవాల్సి పరిస్థితి ఉంది. దీంత చాలా మంది సైడ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారు. దీంట్లో వ్యాపారానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు.
ఇంట్లోనే ఉంటూ చేసుకునే వ్యాపారాల కోసం ప్లాన్ చేస్తున్నారు. అయితే మనలో చాలా మంది వ్యాపారం అనగానే పెట్టుబడి, లాభనష్టాల గురించి వెనకాముందు అవుతుంటారు. అయితే కొన్ని రకాల వ్యాపారాలను తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. అంతేనా మంచి లాభాలను కూడా ఆర్జించవచ్చు.
కాలంతో సంబంధం లేకుండా నిత్యం డిమాండ్ ఉండే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. పెన్సిల్స్ వాడకం కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది. స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసుల్లో ఉండే వారికి వరకూ ప్రతీ ఒక్కరూ పెన్సిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పెన్సిల్స్‌లో తయారీలో కాలంతో పాటు ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. తాజాగా వెల్వెట్ పెన్సిల్స్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. వీటిని ఇంట్లోనే తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పెన్సిల్స్‌ను ఎలా తయారు చేయాలి.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్వెట్ పెన్సిళ్ల తయారీకి ఒక మిషన్ కావాల్సి ఉంటుంది. అలాగే ముడి సరుకు కూడా అవసరపడుతుంది. వెల్వెట్ పెన్సిల్ తయారీ మిషన్ ధర సుమారు రూ. లక్షపైనే ఉంటుంది. దీంతో పాటు ఎలాంటి కలర్ లేని పెన్సిల్స్ అలాగే గమ్, ఒక క్యూబ్ అవసర పడుతుంది వీటితో పాటు పెన్సిల్స్‌కు అప్లై చేయడానికి కలర్ కూడా కావాలి. వీటన్నింటినీ మార్కెట్‌లో పలు సంస్థలు అందిస్తున్నాయి. ఇక తయారీ విషయానికొస్తే ముందుగా క్యూబ్ తీసుకొని దానికి నాలుగు పెన్సిల్స్‌ను అమర్చాల్సి ఉంటుంది. అనంతరం ఒక మిషిన్‌లో కలర్ పౌడర్‌ను పోసి ఈ నాలుగు పెన్సిల్స్‌ను అందులో పెట్టాలి.
అనంతరం మిషిన్‌ను ఆన్ చేయగానే కలర్ మొత్తం పెన్సిల్‌కు అంటుకుంటుంది. వీటిని పక్కన పెట్టి కలర్ ఆరేంత వరకు ఉంచాలి. అనంతరం వీటిని మీ సొంత బ్రాండింగ్‌తో మార్కెట్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో బౌ బ్యాక్ పేరుతో కూడా కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థలకు డబ్బులు చెల్లించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం బెటర్.