టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. భరత్ హీరోగా పరిచయమవుతున్న జగన్నాథ్ టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్నాడు మనోజ్.
ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నన్ను ఎంతో మంది తొక్కాలని చూస్తున్నారు. మీరేం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరు అని అన్నారు మంచు మనోజ్. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో జరిగిన ఈ టీజర్ లాంచ్ వేడుకలో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జగన్నాథ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మంచు మనోజ్ మాట్లాడుతూ.. పరోక్షంగా మంచు విష్ణు మీద, కన్నప్ప మీదా కామెంట్స్ చేశారు. ” బడ్జెట్ కోటా? వంద కోట్లా అనేది ఎవరూ చూడరు. బావుందా.. లేదా.. అనేది కీలకం. నన్నునాలుగు గోడల మధ్యకి రానియ్యకపోయినా ఫర్లేదు. నన్ను ఏం చేసినా.. ఫ్యాన్స్ గుండెల నుంచి వేరు చేయలేరు. నన్ను ఏం చేయాలన్నా.. అభిమానుల వల్లే అవుతుంది. న్యాయం కోసం ఎంత దూరం అయినా వెళ్తాను.
మీరే నా దేవుళ్లు.. మీరే నా కుటుంబం, మీరే నాకు అన్నీ.. చెట్టుపేరో, జాతి పేరో చెప్పుకుని మార్కె్ట్లో అమ్ముడుపోవడానికి నేను కాయో, పండో కాదు.. మీ మనోజ్ ను. మనోజ్ ను తొక్కుదామని చూస్తారా.. ? నలుపుదామని చూస్తారా.. ? నన్ను తొక్కాలన్నా, లేపాలన్నా అది అభిమానుల వల్ల మాత్రమే అవుతుంది. ఈ ప్రపంచంలో ఇంకెరవరి వల్లా కాదు.. ఓ మంచి కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగేవరకు దాన్ని వదిలిపెట్టేది లేదు. అది బయటవాళ్లైనా సరే. నా వాళ్లయిన సరే.. న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తాను. నేను విద్యార్థుల కోసం నిలబడ్డాను. నా ప్రాణం ఉన్నంతవరకు నిలబడతాను. ఈరోజే కాదు.. ఎప్పటికీ ఎవరూ నన్నూ ఆపలేరు ” అని అన్నారు మనోజ్.