మంచు బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మంచు మనోజ్ తాజాగా ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ గురించి ఓ సెటైరికల్ ట్వీట్ వేసి వార్తల్లో నిలిచారు.
దొంగప్ప పురాణం వచ్చేస్తోంది – మనోజ్ ట్వీట్
మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ ముదురుతోంది. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న మోహన్ బాబు ఫ్యామిలీలో మంచు మనోజ్ మరోసారి కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. తాజా కంప్లైంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమా ‘భైరవం’కు భయపడి ‘కన్నప్ప’ సినిమాను వాయిదా వేస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏకంగా ‘కన్నప్ప’ మూవీని ‘దొంగప్ప’ అని సంబోధిస్తూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
“మార్క్ యువర్ క్యాలెండర్స్… ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్‌పైకి రాబోతోంది. ఇంతకీ రిలీజ్ జూలై 17నా ? లేదా జూన్ 27నా? 100 కోట్లకు పైగా బడ్జెట్ (80% విస్మిత్ కమిషన్) మూవీ పీఆర్ ప్లానింగ్ కేక” అంటూ మనోజ్ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ‘విస్మిత్ కమిషన్ 80%’ అని స్పెషల్‌గా మెన్షన్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక మరోవైపు ‘కన్నప్ప’ మూవీ 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిందని మంచు విష్ణు ప్రచారం చేస్తుంటే, మరోవైపు మంచు మనోజ్ 100 కోట్లకు పైగా బడ్జెట్ అనే సెటైర్లు విసరడం గమనార్హం. అలాగే మూవీ రిలీజ్ డేట్‌ని కూడా ఈ ట్వీట్ ద్వారా లీక్ చేశాడు. ఇక ఇప్పటిదాకా తాజా వివాదంపై మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు మంచి విష్ణు ఇద్దరూ స్పందించలేదు.
జల్పల్లిలోని నివాసం వద్ద తిష్ట
తాను ఇంట్లో లేనప్పుడు మంచు విష్ణు తన కార్ దొంగిలించారని, తన వస్తువులను తొలగించారని మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. కూతురు బర్త్ డేను సెలబ్రేట్ చేయడానికి జైపూర్‌కి వెళ్ళగా, తను లేని టైం చూసి మొత్తం వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి నిరసన మొదలుపెట్టారు.
ఓవైపు ఇదంతా జరుగుతుంటే మరోవైపు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై ఫోకస్ చేశారు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు మంచు తండ్రీ కొడుకులు. యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసి ‘కన్నప్ప’ గురించి డిస్కస్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.