ప్రధాని పేరు మీద మామిడి పండు.. మోడీ మామిడి అనే పేరు ఎందుకు పెట్టారంటే?

www.mannamweb.com


వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్లే. పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి పండ్లను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. సమ్మర్ లో మామిడి పండ్లకు మస్త్ గిరాఖీ ఉంటుంది. మ్యాంగోను జ్యూస్ లుగా చేసుకుని సేవిస్తుంటారు. ఆవకాయ పచ్చడి ఎంత ఫేమసో వేరే చెప్పక్కర్లేదు. అయితే మామిడిలో ఎన్నో రకాలు ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే. కాగా భారత ప్రధాని మోడీ పేరు మీద ఓ రైతు మామిడి పండ్లను పండించాడు. ఈ పండ్లకు హార్టికల్చర్ ఇన్‌స్టిట్యూట్ ఇతి ప్రత్యేకు రుచిని కలిగి ఉన్న మామిడి పండు అని సర్టిఫై చేసింది.

తమకు ఇష్టమైన వ్యక్తుల కోసం ఒక్కొక్కరు ఒక్కోలా అభిమానం చాటుకుంటూ ఉంటారు. ఓ రైతు ప్రధాని మోడీ పేరు మీదగా కొత్త రకం దేశీ పండును తీసుకొచ్చాడు. మామిడి పండ్లు అంటే తనకు ఎంతో ఇష్టమని పలు సార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు మోడీ పేరు మీద మామిడి పండ్లను పండించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లక్నోలోని మలిహాబాద్‌కు చెందిన ఉపేంద్ర సింగ్‌ ప్రధాని మోడీ పేరుతో పండించిన కొత్త రకం మామిడి పండు ఆసక్తి రేపుతోంది. ఉపేంద్ర రెండు దేశీ మామిడి రకాలను క్రాస్‌ కల్టివేట్‌ చేసి ప్రధాని పేరు మీద ‘మోడీ’ అనే పండుని పండించారు.

ఉపేంద్ర సింగ్‌ పండించిన మామిడి పండ్లకు మోడీ మామిడి అని పేరు పెట్టడానికి గల కారణం.. ఆయన జననేతగా.. రాజకీయాల్లో సాహోసోపేతమైన నిర్ణయాలతో నూతన ఒరవడి సృష్టించారని తెలిపారు. అశేష ఆదరాభిమానాలు పొందారన్న ఉద్దేశ్యంతో మోడీ మామిడి పండు అనే పేరు పెట్టానని చెప్పుకొచ్చారు. ఉపేంద్ర సింగ్‌ అక్కడితో ఆగకుండా ఆ పేరు మీద పూర్తి హక్కులను కూడా సంపాదించుకున్నారు. ఉపేంద్ర సింగ్‌ సాగు చేసిన ఈ కొత్త రకం మోదీ మామిడి మిగతా వాటికంటే మంచి నాణ్యతో కూడిన పల్పు ఉండి, మంచి రుచిని కలిగి ఉందని పేర్కొంటూ మోదీ అనే పేరుపై ఉపేంద్రకి ప్రత్యేక హక్కును మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఈ పండు త్వరలో మార్కెట్లోకి రానుంది.

ప్రత్యేకత:
మోదీ మామిడి రుచి ఇప్పటికే ఉన్న రకాల కంటే చాలా రుచికరమైనది, గుజ్జు కూడా ఎక్కువగా ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇది ఐదు నుంచి ఆరు రోజుల వరు పాడవ్వదని, చౌసా, దుషేరి, లాంగ్రా వంటి రకాల మామిడి పండ్ల కంటే పెద్దదిగా ఉండి టేస్టీగా ఉంటుందని సెంట్రల్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ ఇన్‌స్టిట్యూట్ కూడా ధృవీకరించింది.