Mango Powder : మనం రోజూ చేసే వంటలకు తగిన రుచి, సువాసన రావడానికి రకరకాల పదార్థాలను వాడుతూ ఉంటాం. అందులో మామిడి కాయ పొడి ఒకటి. భారతీయులు చాలా కాలం నుండి వంటల్లో మామిడి కాయ పొడిని వాడుతున్నారు.
వంటల్లో ఉప్పుకు, చింతపండుకు బదులుగా మనం మామిడి కాయ పొడిని వాడుకోవచ్చు. మార్కెట్ లో మనకు ఉప్పు కలిపిన మామిడి కాయ పొడి, ఉప్పు కలపని మామిడి కాయ పొడి రెండు లభ్యమవుతాయి. ఉప్పు కలపని మామిడి కాయ పొడిని వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతంది.
పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడంలో మామిడి కాయ పొడిని వాడుతున్నారు. మామిడి కాయ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మైక్రో న్యూట్రియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో మామిడి కాయ పొడి ఎంతో సహాయపడుతుంది. మనం తిన్న ఆహారం నుండి వచ్చే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా కలవకుండా మామిడి కాయ పొడి ఉపయోగపడుతుంది. మామిడి కాయ పొడిలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా చేరకుండా చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
అధిక బరువును తగ్గించడంలో మామిడి కాయ పొడి ఉపయోగపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మామిడి కాయ పొడి అదుపులో ఉంచుతుంది. మామిడి కాయ పొడిలో ఉండే మ్యాగ్నిఫెరిన్ అనే మూలకం శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరగకుండా చేస్తుంది.
వంశపారపర్యంగా వచ్చే అధిక బరువును తగ్గించడంలోనూ మామిడి కాయ పొడి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది కనుక భవిష్యత్తులో హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
మామిడికాయ పొడిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
మామిడి కాయ పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యి జీర్ణ క్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. మన వంటల్లో పులుపుకు బదులుగామామిడి కాయ పొడిని వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.