Health: నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..

www.mannamweb.com


బాదంను రాత్రంతా నానబెట్టి తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం నానబెట్టిన బాదంతో మాత్రమే కాదని, నానబెట్టిన వాల్‌నట్‌తోనూ ఎన్నో లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? అవును ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు…

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బాదంను రాత్రంతా నానబెట్టి తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం నానబెట్టిన బాదంతో మాత్రమే కాదని, నానబెట్టిన వాల్‌నట్‌తోనూ ఎన్నో లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? అవును ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.

* వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో లభించే ఆరోగ్యకరమైన కొవ్వు.. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

* వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడతాయి, తద్వారా సెల్ డ్యామేజ్‌ను నివారించి, ఇన్ఫ్లమేషన్‌ను తగ్గుతుంది.

* వాల్‌నట్స్‌లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. దీంతో వీటిని తినగానే శరీరానికి ఇన్‌స్టాంట్‌ శక్తి లభిస్తుంది. కాబట్టి ఉదయాన్నే తినడం వల్ల మీ రోజువారీ పని చేయడానికి తగినంత శక్తి లభిస్తుంది.

* వాల్‌నట్స్‌ ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇది జీర్ణక్రియతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ కారణంగా, పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది, తరచుగా ఆకలిగా అనిపించదు. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది కాకుండా, ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఇది మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

* వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. విటమిన్ ఇ ముడతలు, చర్మం కుంగిపోవడం వంటి అనేక వృద్ధాప్య సమస్యలను నివారిస్తుంది.