ఫాస్టర్ టెక్నాలజీ రీప్లేస్‌మెంట్
స్మార్ట్ హోమ్ డివైజెస్ నుంచి డిజిటల్ హెల్త్ టూల్స్, ఇంటెలిజెంట్ వెహికల్స్ వరకు డైలీ లైఫ్‌లో టెక్నాలజీ తప్పనిసరి అవుతోంది. డివైజ్‌లు ఎక్కువ కాలం ఉన్నప్పటికీ, సాఫ్ట్‌వేర్ ఛేంజెస్, బెటర్ ఆల్టర్నేటివ్స్ కారణంగా స్పీడ్‌గా అవుట్‌డేటెడ్ అయిపోతాయి. అంటే క్రమం తప్పకుండా అప్‌గ్రేడ్‌లపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. టెక్నాలజీ వన్ టైమ్ పర్చేస్‌లా కాకుండా రికరింగ్ ఎక్స్‌పెన్స్ అవుతుంది.
ఎల్డర్ కేర్ (Elder Care)
జీవితకాలం పెరగడం, చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో వృద్ధులకు ప్రొఫెషనల్ కేర్ అవసరం అవుతుంది. ఇప్పటికే అసిస్టెడ్ లివింగ్ ఖర్చులు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు. 2040 నాటికి నెలవారీ ఖర్చులు రూ.1-3 లక్షలకు చేరుకోవచ్చు. చాలా కుటుంబాలకు వృద్ధుల సంరక్షణ అతిపెద్ద ఖర్చులలో ఒకటిగా మారవచ్చు.
ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేందుకు (Stay Healthy Longer)
హెల్త్ కేర్ ఇప్పుడు ట్రీట్‌మెంట్ నుంచి ప్రివెంటింగ్ వైపు మూవ్ అవుతోంది. కుటుంబాలు క్రమం తప్పకుండా హెల్త్ ట్రాకింగ్, పర్సనలైజ్డ్ ఫిట్‌నెస్, పోషకాహారం, ఫిజికల్, మెంటల్ హెల్త్ మెయింటైన్ చేసేందుకు టూల్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ఒకేసారి పెద్ద మెడికల్ బిల్స్ చెల్లించడం బదులుగా హెల్త్ కేర్ మంత్లీ లేదా ఇయర్లీ రెగ్యులర్‌గా స్పెండ్ చేయాల్సిన ఖర్చుగా మారుతుంది.
సబ్‌స్క్రిప్షన్ భారం
అనేక సర్వీసులు సబ్‌స్క్రిప్షన్ మోడళ్లకు మారుతాయి. సాఫ్ట్‌వేర్, డిజిటల్ టూల్స్, క్లౌడ్ స్టోరేజ్, సెక్యూరిటీ, వెహికల్స్, గృహోపకరణాలకు కూడా సబ్‌స్క్రిప్షన్ రావచ్చు. ఈ రికరింగ్ ఛార్జీలు ఇంటి బడ్జెట్‌లలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. ట్రెడిషినల్ రిటైర్‌మెంట్ ప్లానింగ్‌ని దెబ్బతీస్తాయి.
లెర్నింగ్, అప్‌స్కిల్లింగ్
ఉద్యోగాలు వేగంగా మారుతాయి. చాలా క్విక్‌గానే ఆయా స్కిల్స్ అవుట్ డేటెడ్ అయిపోతాయి. జాబ్ మార్కెట్‌కి రిలవెంట్‌గా ఉండాలంటే ప్రజలు తమ కెరీర్ అంతటా నేర్చుకుంటూనే ఉండాలి. కోర్సులు, సర్టిఫికేషన్లు, రీట్రైనింగ్ కోసం ఖర్చు చేయడం కామన్ అయిపోతుంది.
మెంటల్ వెల్‌బీయింగ్
ఇకపై మెంటల్, కాగ్నిటివ్ హెల్త్ ఆప్షనల్ స్పెండింగ్ కిందకు రావు. మెంటల్ ఫిట్‌నెస్, థెరపీ, మానిటరింగ్, పర్పస్, ఎమోషనల్ బ్యాలెన్స్‌కి సపోర్ట్ చేసే యాక్టివిటీస్ కోసం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాల్సి రావచ్చు.
ట్రావెలింగ్
ట్రావెలింగ్, ఎక్స్‌పీరియన్సెస్ లైఫ్‌స్టైల్ ప్రయారిటీగా మారుతున్నాయి. 2040 నాటికి ఫ్యామిలీస్ ఇందుకు ప్రత్యేక బడ్జెట్‌లు, లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేయవచ్చు. దీన్నో ప్రధాన ఆర్థిక లక్ష్యం వలె ప్లాన్ చేయాల్సి రావచ్చు.
క్లైమెట్ రిలేటెడ్ లివింగ్ కాస్ట్
కాలం గడిచేకొద్దీ వాతావరణం అనూహ్యంగా మారుతుంది. కాలుష్యం కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇంటి కూలింగ్, హీటింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్, ఎనర్జీ యూజ్‌కి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఖర్చులు ఒకేసారి కాకుండా రికరింగ్ ఎక్స్‌పెన్స్‌లా మారుతాయి. మంత్లీ బడ్జెట్‌లలో రెగ్యులర్ పార్ట్‌గా మారుతాయి.
ఇవి కూడా చదవండి: Insurance: బీమా రంగంలో సంచలన మార్పులు.. సామాన్యులకు వచ్చే లాభం ఏంటంటే?
డిజిటల్ సెక్యూరిటీ కాస్ట్‌లు
ఆన్‌లైన్‌లో ఎక్కువ జీవితం గడిచేకొద్దీ, సైబర్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. స్ట్రాంగ్ డిజిటల్ సెక్యూరిటీకి పేమెంట్ సర్వీసులు అవసరం కావచ్చు. బేసిక్ ఆన్‌లైన్ టైల్స్ కూడా ఫ్యూచర్‌లో ఫ్రీగా అందవు. డిజిటల్ సెక్యూరిటీ కూడా ఇంటి బడ్జెట్‌లో భాగంగా మారుతుంది.




































