పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు అనేది నిన్నటి మాట.. ఇప్పటి నుంచి పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైరు. పుష్ప ట్రైలర్‌తో జనాలకు బాగా అర్థమైంది అదే. పాట్నా వేదికగా జరిగిన ట్రైలర్ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో అక్కడ ట్రైలర్ లంచ్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్.. బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్ అంటూ సగర్వంగా చెప్పుకున్నారు మేకర్స్.
900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో అక్కడ ట్రైలర్ లంచ్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్.. బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్ అంటూ సగర్వంగా చెప్పుకున్నారు మేకర్స్.
ట్రైలర్ చూడగానే ఇన్‌స్టంట్‌గా గూస్బంప్స్ వచ్చేశాయని అంటోంది అల్లు ఆర్మీ. పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అంటూ విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయని నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పాట్నాలోని గాంధీ మైదానంలో దాదాపు రెండు లక్షల మంది అభిమానుల సమక్షంలో పుష్ప 2 ట్రైలర్‌ని లాంచ్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ – సుకుమార్ కలిసి రెండేళ్లు చేసిన మ్యాజిక్కి పేరు పుష్ప2.
వెయ్యి కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేస్తుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. దానికి తగ్గట్టే పాట్నాలో ఫ్యాన్స్ రిసెప్షన్ అదిరింది. సౌత్ హీరోకి నార్త్ లో అంత మంది ఫ్యాన్స్ ఏంటని అందరూ విస్తుబోతున్నారు.
రెండు నిమిషాల 44 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో.. ఇలా వ్యూస్ అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ట్రైలర్లో ప్రతి కేరక్టర్ గురించీ మాట్లాడుకుంటున్నారు జనాలు.
జగపతిబాబు, ఫాహద్ ఫాజిల్.. ఇలా ప్రతి ఒక్కరి గురించీ డిస్కస్ చేసుకుంటున్నారు అభిమానులు. డిసెంబర్ 5న రిలీజ్‌కి రెడీ అవుతున్న పుష్ప ది రూల్‌ని చూడటానికి ప్యాన్ ఇండియా రేంజ్లో ఎంత మంది వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెప్పింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్.
దానికి తగ్గట్టే ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు రష్మిక అండ్ బన్నీ. సిల్వర్ స్క్రీన్స్ మీద వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో చూడటానికి రెడీగా ఉండమని పిలుపునిచ్చేశారు ఐకాన్‌స్టార్.