రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పెట్రోపావ్లోవ్స్ కామ్చాట్‌స్కీ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ భూకంపం తర్వాత మరోసారి 5.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే రష్యాకు అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే రష్యాతో పాటు ఇండోనేషియాలోని సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని భూకంప కేంద్రం భూమికి 28 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల కూడా పెద్దగా నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఈ రెండు భూకంపాలు స్వల్ప వ్యవధిలోనే సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.


































