టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పుట్టిన రోజు నేడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. అదే సమయంలో కొంతమంది ఫ్యాన్స్ మీనాక్షికి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఫ్యాన్స్ పిలుపు కోరిక మేరకు మీనాక్షి చౌదరి కూడా అక్కడికి వెళ్ళింది. ఇక అక్కడి నుంచి అభిమానుల హడావిడి మొదలైంది. మీనాక్షి ఎంట్రీ ఇవ్వగానే మొదట పేపర్ బ్లాస్ట్ లతో, అరుపులతో హంగామా చేసారు ఫ్యాన్స్. అనంతరం కొద్ది సేపు మాట్లాడిన మీనూ ఆ తర్వాత బర్త్ డే కేక్ కట్ చేసింది. ఆ సమయంలో అరుపులు, కేకలతో హోరెత్తించారు అభిమానులు. అంత మంది ఫ్యాన్స్ తనపై చూపించిన ప్రేమకు మీనాక్షి కూడా ఎమోషనల్ అయ్యింది. అందరికీ ధన్యవాదాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇది చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు మీనాక్షికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
కాగా డెంటిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఫెమినా మిస్ ఇండియా గా విజయం సాధించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. మొదట ఓ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు.
అయితే 2024 మీనాక్షి కెరీర్ లో మర్చిపోలేని సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుకంటే గతేడాది ఆమె నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో మహేష్ బాబుతో గుంటూరు కారం, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, దళపతి విజయ్ తో గోట్ వంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఇక ఈ పొంగల్ కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుందీ అందాల తార. ఇక మీనాక్షి త్వరలో అనగనగా ఒక రాజు సినిమాతో రానుంది. మరో రెండూ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం.
































