మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కొడుకు సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తానని అన్నారు. అలాగే పాలిటిక్స్‌లో రీ ఎంట్రీపై (Re-entry into politics) ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయంగా సాధించాలని అనుకున్న అన్ని ఆశయాలను పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ (Pawan Kalyan, Janasena Party) సాధించాయని ఆ సంతోషం తనకు సరిపోతుందన్నారు. అలాగే ఇటీవల వివిధ రాజకీయ పార్టీల నేతలను, ప్రభుత్వాలను కలవడంపై ఆయన స్పందిస్తూ.. సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమే వారిని కలుస్తున్నానని చెప్పుకొచ్చారు.

తాను జీవితాంతం రాజకీయాలకు (politics) దూరంగా ఉంటానని బ్రహ్మానందం సినీ ఈవెంట్ (Brahmanandam movie event)లో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను ఉన్నంతకాలం కళామ్మతల్లి (Kalammathalli) సేవలోనే గడిపేస్తానని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (మెగాస్టార్ చిరంజీవి) సంచలన నిర్ణయాన్ని (Sensational decision) ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. ఈ నిర్ణయం ప్రకటించగానే బ్రహ్మానందం ఈవెంట్ (Brahmanandam event) ఈలలు కేకలతో మారుమోగిపోయింది. కాగా ఈ రోజు చిరంజీవి ప్రకటించిన నిర్ణయంతో ఆయనపై కొద్ది రోజులుగా వస్తున్న రూమర్స్ (Rumors)కు ఒక్కసారిగా చెక్ (చెక్) పెట్టారు.