లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామ‌న్స్ – యూకే పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారం జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యూకేకు చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని సన్మానించారు.


మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు చిరు. వాల్తేరు వీరయ్యలాంటి హిట్ తర్వాత చిరంజీవి నటించిన బోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.

చిరంజీవి పేరు మీదున్న రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ అందుకున్న మెగాస్టార్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామ‌న్స్ – యూకే పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారం జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యూకేకు చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని సన్మానించారు.

మార్చి 19న జరిగిన ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు హాజరయ్యారు. ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. ఇందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.