మగాళ్లు.. 30 సంవత్సరాలు దాటినా పెళ్లి చేసుకోలేదా?.. ఈ సమస్య నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు!

www.mannamweb.com


ప్రస్తుతం ఉన్న కాలంలో పెళ్లి చేసుకోవడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో సెటిల్ అయ్యామా? ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నామా?

పిల్లలను పోషించడానికి మన స్థోమత సరిపోతుందా అనేది అన్ని తెలుసుకున్నాకే పురుషులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. దీని కారణంగా చాలా మంది లేటుగా 30 సంవత్సరాలు దాటినా తరువాత పెళ్లి చేసుకుంటున్నారు. దీనివల్ల వారు తమ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలను కనడానికి కూడా ఎంతో సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అనేది ఇక్కడ తెలుసుకుందాం.

పని ప్రభావం..

జీవితంలో సెటిల్ కావాలనే ఉద్దేశంతో అందరూ చాలా కస్టపడి ఉద్యోగం సంపాదిస్తారు. ఉద్యోగం పొందిన తరువాత గంటలు గంటలు ల్యాప్‌టాప్‌ల వద్దే కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. వయసు పెరిగిపోవడంతో పాటు, గంటలు గంటలు కూర్చొని ఎలక్ట్రానిక్స్ ముందు కూర్చొని పని చేయడం అనేది కచ్చితంగా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా పిల్లలు కూడా పుట్టడం చాలా ఆలస్యమవుతుంది.

ఆరోగ్య సమస్యలు

మన వయసు పెరిగేకొద్దీ మనలోని సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. 30 సంవత్సరాలు దాటిన తరువాత ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా శరీరం చాలా హీనమైపోతుంది. దీంతో పిల్లలు పుట్టడానికి అవసరమయ్యే కణాలను హత్య చేస్తుంది. దీంతో పిల్లలు పుట్టడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది.

సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోవడం వల్ల లైంగిక జీవితంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. 30 తరువాత పెళ్లి చేసుకోవడం వల్ల లైంగిక సమస్యలు ఎక్కువ అవుతాయి. దీంతో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా అవుతుంటాయి. ఆ గొడవల కారణంగా కొన్ని కొన్ని సార్లు విడాకులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు.

సర్దుకోవడం కష్టం

30 సంవత్సరాలు దాటిన తరువాత ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మారుతుంది. ముఖ్యంగా కోరికలు అనేవి స్థిరంగా మారిపోతాయి. దీంతో భాగస్వామితో సర్దుకుపోవడం కష్టంగా మారడంతో పాటు, వారితో ఎప్పుడూ గొడవలకు ఇష్టపడుతుంటారు. దీని కారణంగా వైవాహిక జీవితం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతుంది. భాగస్వామికి అవసరమైన కోరికలు తీర్చకపోవడంతో పాటు మీరు వారి ముందు చులకన అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

దీంతో పాటు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే.. మీరు 30 సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లి చేసుకున్నారనుకోండి, వారు టీనేజ్‌లోకి వచ్చేసరికి మీకు 50 సంవత్సరాల వరకు వచ్చేస్తుంది. దీంతో మీ ఆర్ధిక జీవితం అతలాకుతలం అవుతుంది. దీంతో వారి విద్య, ఉపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే వయసు వచ్చిన పురుషులు త్వరగా పెళ్లి చేసుకోవడానికి సిద్దపడండి.

ఇది కాకుండా మీరు ఒకవేళ 35 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు పిల్లలు ఉంటే వారికి టీనేజ్‌ వచ్చే సరికే మీరు 50 ఏళ్లు దాటిపోతారు. ఇది మీ ఆర్థిక జీవితం వారి విద్యా, ఉపాధిపై ప్రభావం చూపుతుంది.