Mens Health : వయసు పైబడే కొద్ది పురుషుల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లతో పాటు పోషకాలల్లో కూడా క్షీణత వస్తుంది. 30 ఏళ్లు దాటిన తరువాత వారి శరీరానికి, జీవక్రియకు మద్దతు ఇచ్చే విటమిన్లను తీసుకోవడంపై శ్రద్ద చూపించడం చాలా అవసరం. తగిన ఆహారాలను తీసుకోవడంతో పాటు తరుచూ పరీక్షలు చేయించుకుంటూ శరీరంలో తక్కువగా ఉన్న విటమిన్లను క్యాప్పుల్స్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేయాలి. 30 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడుకి అవసరమైన విటమిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 30 ఏళ్లు దాటిన తరువాత పురుషులల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు క్షీణిస్తాయి. కనుక ఇటువంటి సమయంలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ డి ను తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ తగిన మొత్తంలో ఉత్పత్తి అవ్వడంతో పాటు ఎముకలు కూడా ధృడంగా తయారవుతాయి. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.
అలాగే విటమిన్ బి12 కూడా చాలా అవసరం. ఇది ఎక్కువగా మాంసాహారంలో ఉంటుంది. కనుక శాఖాహారులు మాత్రం దీనిని సప్లిమెంట్స్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎర్ర రక్తకణాల తయారీలో, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో విటమిన్ బి12 కీలకపాత్ర పోషిస్తుంది. 30 ఏళ్లు దాటిన పురుషులు విటమిన్ బి 6 లోపం లేకుండా కూడా చూసుకోవాలి. ఎర్ర రక్తకణాల తయారీలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ బి6 మనకు సహాయపడుతుంది. చేపలు, ధాన్యాలు, పౌల్ట్రీ, గింజలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు తగినంత విటమిన్ బి6 లభిస్తుంది.
అలాగే మెగ్నీషియం కూడా మనకు అవసరమయ్యే పోషకాల్లో ఒకటి. గుండె మరియు కండరాల ఆరోగ్యానికి, రక్తపోటు మరియు చక్కెర అదుపులో ఉండడానికి, నాణ్యమైన నిద్రను అందించడంలో, 30 ఏళ్లు దాటిన తరువాత శరీర బరువు అదుపులో ఉండడానికి ఇలా అనేక రకాలుగా పురుషులకు మెగ్నీషియం అవసరమవుతుంది. ఇక 30 దాటిన పురుషులు తప్పకుండా తీసుకోవాల్సిన పోషకాల్లో జింక్ కూడా ఒకటి. టెస్టోస్టిరాన్ స్థాయిలను, హార్మోన్ల స్థాయిలను అదుపులో ఉంచడంలో, అంగస్తంభన సమస్యను పరిష్కరించడంలో, టెస్టోస్టిరాన్ ను ఈస్ట్రోజన్ గా మారకుండా నిరోధించడంలో ఇలా అనేక రకాలుగా పురుషులకు జింక్ అవసరమవుతుంది. అలాగే 30 దాటిన పురుషులు ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు కూడా శరీరానికి చక్కగా అందుతున్నాయో లేదో చూసుకోవాలి.
ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించడంలో, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె జబ్బులు రాకుండా అరికట్టడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఫోలేట్ ( విటమిన్ బి9) ను కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. డిఎన్ఎ మరమ్మత్తులకు, కణ విభజనకు,కణాల పెరుగుదలకు ఫోలేట్ చాలా అవసరం. బచ్చలికూర వంటి ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ బి9 లభిస్తుంది. 30 దాటిన పురుషులు విటమిన్ కె ను కూడా తగిన మొత్తంలో తీసుకోవడం చాలా అవసరం. ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో, వయసు పైబడే కొద్ది వచ్చే మతిమరుపును తగ్గించడంలో విటమిన్ కె కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే 30 దాటిన పురుషులు విటమిన్ ఎ కూడా తగిన మొత్తంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శుక్ర కణాల ఉత్పత్తికి, ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇలా విటమిన్ ఎ అనేక రకాలుగా సహాయపడుతుంది. అదే విధంగా ఐరన్ కూడా తగిన మొత్తంలో శరీరానికి అందుతుందో లేదో చూసుకోవాలి. ఎర్ర రక్తకణాల తయారీకి, శక్తికి ఐరన్ ఎంతో అవసరమవుతుంది. ఈ విధంగా ఈ పోషకాలను 30 దాటిన పురుషులు తప్పకుండా తమ శరీరానికి అందేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.