స్కూల్లో అమానవీయం.. పీరియడ్స్ వచ్చిందని బాలికను ఆరుబైట కూర్చొబెట్టి ఎగ్జామ్

సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మహిళలు, బాలికల భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల కోసం అనేక పథకాలు ఆయా రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి.


ఈ క్రమంలో ఎక్కడ కూడా మహిళలు ఇబ్బందులు పడకుడదని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

మరోవైపు మహిళలపై వేధింపులు జరిగిన కూడా దాని కోసం కఠినంగా చట్టాలు కూడా అమలు చేస్తున్నాయి. ఇంత చేస్తున్న కూడా మహిళలు, బాలికలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. ప్రతిరోజు మహిళలు, ఆడవాళ్లపై జరుగుతున్న దాడులు వార్తలలో ఉంటున్నాయి. మొత్తంగా ఎన్ని అవగాహన కార్యక్రమాలు, ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కూడా మహిళల భద్రత మాత్రం గాల్లొ దీపంలా మారిందా అన్న సందేహం కల్గుతుంది.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో జరిగిన దారుణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

తమిళనాడులోకి కోయంబత్తురులోని 8వ తరగతి చదువుతున్న బాలికకు ఇటీవల పీరియడ్స్ తొలిసారి వచ్చింది. దీంతో ఆమె రెండు రోజులకే స్కూల్లో ఎగ్జామ్ లను రాసేందుకు వచ్చింది. అయితే.. బాలికను స్కూల్లొ లోపలికి రానియలేదు. కేవలం స్కూలు బైట వరండా మీద కూర్చొబెట్టి ఎగ్జామ్ రాయించారు.

ఇంటికొచ్చాక బాలిక జరిగిన దారుణాన్ని.. తల్లిదండ్రులతో చెప్పింది. మరో రెండో రోజు కూడా అదే విధంగా కూర్చొబెట్టడంతో తల్లి స్కూల్లోకి వచ్చి చూసి.. ఘటనను తన సెల్ ఫోన్ లలో రికార్డు చేసింది. యాజమాన్యంను దీనిపై ప్రశ్నించగా.. ఆమె మీద రివర్స్ దాడికి దిగారు.ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాము దళితులమనే తమను ఈ విధంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో అది కాస్త వైరల్ గా మారడంతో విద్యాశాఖ దీనిపై సీరియస్ అయ్యింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. దీనిపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. ఇంతకన్నా.. ఘోరం మరోకటి ఉంటుందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.