Menthulu Water For Weight Loss And Diabetes Control: భారతీయులు ప్రతి ఆహార పదార్థాల్లో మెంతులను వినియోగిస్తారు. ముఖ్యంగా వీటిని పులుపు కలిగిన కర్రీస్‌లో ఎక్కువగా వాడతారు.
ఇవి ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. మెంతికూరలో సోడియం, పొటాషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి వంటి అనేక రకాల పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు మెంతి ఆకులను ఆహారాల్లో వినియోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మెంతి గింజలను నీటిలో నానబెట్టి తీసుకుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుత లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది:
రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతి గింజల నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఔషధ గుణాలు గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం ఇతర దీర్ఘకాలిక పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా క్రమం తప్పకుండా మెంతికూరను తీసుకోవడం వల్ల మలం కూడా మృదువుగా వస్తుంది. దీంతో పాటు మెంతి నీరులో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్ గుణాలు జీర్ణక్రియను మెరుగు పరిచేందుకు కూడా సహాయపడుతుంది.
చర్మానికి ఎంతగానో సహాయపడుతుంది:
మెంతి నీరులో ఉండే ఔషధ గుణాలు చర్మానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా స్కిన్ అలర్జీ, ఇతర చర్మ సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిచేందుకు కూడా కీలక పాత పోషిస్తుంది. దీంతో పాటు మొటిమలు, మచ్చలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీని కారణంగా చర్మం కూడా మృదువుగా తయారవుతుంది.
బరువు తగ్గడం:
మెంతికూరలో ఉండే ఆయుర్వేద గుణాలు, పీచుపదార్థాలు ఆకలిని సులభంగా నియంత్రిస్తాయి. దీని కారణంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించేందుకు సహాయపడుతుంది. కాబట్టి బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా మెంతి కూరను క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
చక్కెర పరిమాణాలపై ప్రభావం:
మధుమేహంతో బాధపడేవారిలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడం చాలా కీలకం. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా కొంతమందిలో చక్కెర పరిమాణాలు వేంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా తీవ్ర మధుమేహం బారిన పడుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే తప్పకుండా మెంతి నీటిని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది.