మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సెట్టయ్యే కారు.. ధర 2 లక్షలే! వర్షానికి, ఎండకి చెక్

www.mannamweb.com


కారులో వెళ్తే ఉండే సేఫ్టీ బైక్ మీద గానీ స్కూటీ మీద గానీ వెళ్లేవారికి ఉండదు. వర్షాల్లో అయితే టూవీలర్ మీద వెళ్లే వారికి నరకమే. ఇక ఫ్యామిలీతో వెళ్తే ఊహించడమే కష్టం. ఆ బురద, ఆ వర్షం, ట్రాఫిక్ లో నడపడం ఇంకా కష్టం అవుతుంది. అందుకే చాలా మంది కారు కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ కారు ధరలు చూస్తే 5 లక్షలు పైనే ఉంటున్నాయి. ఇక ఆ కార్లు ఇచ్చే మైలేజ్ కి, అయ్యే పెట్రోల్ ఖర్చుకి వచ్చిన జీతం సరిపోతుంది. ఇక ఏం తినాలి? ఎలా బతకాలి? అన్నట్టే ఉంటుంది. దానికి తోడు సర్వీసింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు సరదా తీర్చేస్తాయి. కారు బయటకు తీస్తే జేబులో 10 వేలు ఉండాలి. పెట్రోల్ కి కనీసం 2 వేలు అయినా ఉండాలి. మరీ ముఖ్యంగా కారు పెట్టుకోవడానికి పార్కింగ్ ఉండాలి. కారు కొనేందుకు డబ్బు, పార్కింగ్ ప్లేస్, దాని కోసం పెద్ద ఇంటికి మారడం, ఆర్థిక స్థోమత.. ఇన్ని ఉంటేనే గానీ సొంతింటి కారు కల నిజం కాని పరిస్థితి. పోనీ ఎలక్ట్రిక్ కారు కొందామంటే అది ఏకంగా 10 లక్షల నుంచి ఉన్నాయి.

అయితే బైక్ మీద అడ్జస్ట్ చేసుకుని వెళ్లినట్టు వెళ్లేందుకు మీరు సిద్ధంగా ఉంటే కనుక ఈ కారుని మించిన కారు మరొకటి ఉండదు. చిన్న కుటుంబానికి ఇది చాలా బెస్ట్ కారు. ఎందుకంటే ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ధరకే ఈ కారు వస్తుంది. అది కూడా ఎలక్ట్రిక్ కారు. మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువ. పెట్రోల్ భారం ఉండదు. ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువే వస్తుంది. వింగ్స్ ఈవీ అనే కంపెనీ వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల కోసం 2 లక్షల బడ్జెట్ లో మినీ ఎలక్ట్రిక్ కారుని తీసుకొచ్చారు. ఇది బైక్ సైజులో, కారులో సగం ఉంటుంది. కాబట్టి పార్కింగ్ కి కూడా ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు. వింగ్స్ ఈవీ కంపెనీ రాబిన్ అనే కారుని తీసుకొచ్చింది. ఇందులో ఈ, ఎస్, ఎక్స్ మూడు వేరియంట్లు ఉన్నాయి. ‘ఈ’ వేరియంట్ కెర్బ్ బరువు 486 కిలోలు ఉండగా.. ‘ఎస్’, ‘ఎక్స్’ వేరియంట్ల కెర్బ్ బరువు 501 కిలోలుగా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ‘ఈ’ వేరియంట్ 65 కి.మీ. ప్రయాణిస్తుంది.

అదే ఎస్ వేరియంట్, ఎక్స్ వేరియంట్ అయితే 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారుని ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. మొదటి వేరియంట్ లో ఏసీ గానీ, బ్లోవర్ గానీ ఉండదు. ఎస్ వేరియంట్ లో బ్లోవర్ ఇస్తున్నారు. ఎక్స్ వేరియంట్ లో ఏసీ ఇస్తున్నారు. సేఫ్టీ అలర్ట్స్ విషయానికొస్తే ఎక్స్ వేరియంట్ లో మాత్రమే ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే ‘ఈ’ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 1,99,000గా ఉంది. ‘ఎస్’ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 2,49,000 కాగా, ఎక్స్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 2,99,000గా ఉంది. ఇది 2 సీటర్ కెపాసిటీతో వస్తుంది. ముందు ఒకటి, వెనుక ఒకటి రెండు సీట్లు ఇచ్చారు. ఒక చిన్న పిల్లలు ఉన్న చిన్న ఫ్యామిలీకి ఇది సూట్ అవుతుంది. ఏమైనా సరుకులు తెచ్చుకోవడానికి, డైలీ ఆఫీస్ కి వెళ్లి రావడానికి, తక్కువ దూరాలు ప్రయాణించేవారికి ఇది సెట్ అవుతుంది. ట్రాఫిక్ లో కూడా ఈజీగా మ్యానేజ్ చేయవచ్చు. బైక్ మీద ట్రాఫిక్ లో గానీ, వర్షాల్లో గానీ నడపాలంటే ఆ బురదకి, ఆ రద్దీకి చిరాకు వేస్తుంది. అదే ఈ బైక్ సైజ్ కారులో అయితే సుఖంగా వెళ్ళవచ్చు. ఇది నీలం, ఆరెంజ్, రెడ్ కలర్స్ అందుబాటులో ఉంది.

రాబిన్ ఈవీ కారు స్పెసిఫికేషన్స్:
ప్రధాన స్పెసిఫికేషన్స్:

వెహికల్ కేటగిరీ: ఎల్7
రిజిస్ట్రేషన్, లైసెన్స్: ఉండాలి
చక్రాలు, డోర్స్: 4
సీటింగ్ కెపాసిటీ: 2 (ముందు, వెనుక)
గ్రౌండ్ క్లియరెన్స్: 160 ఎంఎం
కెర్బ్ వెయిట్: 501 కేజీ
టైర్లు: 120/80-R12
వేరియంట్స్: మూడు (e, s, x)

పెర్ఫార్మెన్స్:

టాప్ స్పీడ్: గంటకు 64 కి.మీ.
గ్రేడబిలిటీ: 10 డిగ్రీస్ (18%)
గంటకు 0-40 కి.మీ: 5 సెకన్లలో
రేంజ్: సింగిల్ ఛార్జ్ తో 90 కి.మీ.

భద్రత:

రోల్ కేజ్ మెటీరియల్: హై స్ట్రెంత్ స్టీల్
ఫ్రంటల్ క్రాష్ టెస్ట్: పాస్
సీట్ బెల్ట్స్: డ్రైవర్, ప్యాసింజర్
థర్మల్ మానిటరింగ్: వాహనం చుట్టూ 16 టెంపరేచర్ సెన్సార్లు
ఆడియో అలర్ట్స్: సురక్షితంగా నడిపేందుకు డ్రైవర్ ని అలర్ట్ చేస్తుంది.

పవర్ ట్రెయిన్:

రేటెడ్ పవర్: 3+3= 6 కిలో వాట్
మ్యాక్స్ టార్క్: 282 ఎన్ఎం
మోటార్ రకం: 2 బీఎల్డీసీ హబ్ మోటార్స్
రీజనరేటివ్ బ్రేకింగ్: ఉన్నాయి
ట్రాన్స్ మిషన్ టైప్: సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్

బ్యాటరీ మరియు ఛార్జింగ్:

బ్యాటరీ కెపాసిటీ: 5.6 కిలోవాట్ హవర్
సెల్ టైప్: ఎల్ఎఫ్పీ
ఛార్జర్: 1.8 కిలో వాట్, ఆన్ బోర్డ్
ఛార్జింగ్ సమయం: 5 గంటలు (0 – 100%), 30 నిమిషాలు (10 కి.మీ.)
ఛార్జింగ్ పాయింట్: 230 వోల్ట్స్/ 16 ఏ సాకెట్

మీకు కనుక ఎలక్ట్రిక్ టూవీలర్ కొనే ఉద్దేశం ఉంటే కనుక దాని కంటే ఈ కారు కొనుక్కోవడం చాలా ఉత్తమం. వింగ్స్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని లోక్ మాన్య నగర్ లో ఉంది. ఈ కారుని 5 వేల రూపాయలతో కంపెనీ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.