అదిరే మైలేజీ, సూపర్ ఫీచర్లతో టాప్ లో నిలిచిన క్రెటా

www.mannamweb.com


హ్యుందాయ్ నుంచి వచ్చిన క్రెటా ఎస్‌యూవీకి (Hyundai Creta) మార్కెట్లో మామూలు క్రేజ్ లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ కార్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో దుమ్మురేపుతుంది. అదిరిపోయే సేల్స్ నమోదు చేస్తుంది. ఈ కారు సేల్స్ విషయానికి వస్తే గత ఆగస్టు నెలలో ఏకంగా 16,762 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే కారుని 2023లో విక్రయించినప్పుడు 13,832 యూనిట్లు సేల్ అయ్యాయి. ఆ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది 21 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయి. ఇంకా అంతే కాకుండా ఈ కారు ఎస్‌యూవీ విభాగంలో టాప్లో ఉంది. ఇక ఈ కార్ ఫీచర్లు, ధర ఇంకా మరిన్ని వివరాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఇంకా డీజిల్ పవర్ట్రెయిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ కార్ 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది మాక్సిమం 115 ps పవర్‌ని కలిగి ఉంటుంది. 144 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇక 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే 160 ps పవర్, 253 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. మరో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే 116 ps పవర్, 250 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇంకా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ కార్ వస్తుంది. ఈ కారు 16.54 నుంచి 20 కిలోమీటర్ల దాకా మైలేజీ ఇస్తుంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్‌ కలిగి ఉంటుంది. మంచి ప్రీమియం లుక్ తో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ కారులో ఐదుగురు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ఇందులో లగేజీ పెట్టుకోవడానికి మొత్తం 433 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఉంటుంది. లాంగ్‌ జర్నీలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఈ కారులో ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్ ప్లేలు (ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ & ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్), డ్యూయల్ జోన్ ఏసీ, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. అలాగే ఈ కారులో ఇంకా అప్డేటెడ్ ఫీచర్లు ఉంటాయి.ఈ కారు బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ .11 లక్షల నుండి రూ .20.30 లక్షల (ఎక్స్-షోరూమ్) దాకా ఉంటుంది. ఇక వేరియంట్ల విషయానికి వస్తే.. ఈ కార్ E, EX, S, S (O), SX Tech వంటి 7 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంకా వీటితో పాటు నైట్‌ ఎడిషన్‌లో కూడా ఈ కార్ వస్తుంది.