కొన్ని సినిమాలు చూస్తే ఇది కదా స్టోరీ అంటే.. ఇవి కదా ట్విస్ట్ లంటే అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. అందులోను కొన్ని సినిమాలు క్లైమాక్స్ కోసమైనా కదలకుండా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఇక ఈ సినిమా చూసిన తర్వాత.. వాట్ ఏ ఫిల్మ్ .. వాట్ ఏ థాట్ అని అనకుండా మాత్రం ఉండలేరు. ఇప్పటి వరకు ఈ సినిమా చూడకపోతే మాత్రం ఓ మంచి థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. టెట్ అనే వ్యక్తి ఓ ఎయిరోనాటికల్ ఇంజినీర్.. అలాగే బాగా రిచ్ కూడా. ఓసారి ఇతను ఓ రిసార్ట్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఓ కపుల్ ను ఫాలో అవుతూ ఉంటాడు. అలాగే వాళ్ళ రూమ్ లోకి వెళ్లి అక్కడున్న వాటిని గమనిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఈ కపుల్ లోని లేడి తన ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత టెట్ కూడా అక్కడే ఉంటాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ టెట్ ఆమె ఈ టెట్ వైఫ్. ఆమె మరొకరితో సంబంధం పెట్టుకున్న విషయం తెలిసిపోవడంతో.. ఆమెను కాల్చేస్తాడు. అలాగే ఆ హత్య తన చేయలేదని నిరూపించుపించుకోడానికి.. ఆధారాలన్నీ మాయం చేస్తాడు.
కట్ చేస్తే అదే ఇంటికి ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఈ పోలీసు ఎవరో కాదు ఆ కపుల్ లో వ్యక్తి. నార్మల్ గా ఓ హత్య గురించి తెలుసుకుని.. ఇంటరాగేట్ చేయడానికి వస్తాడు. అప్పటికే టెట్ చేతిలో గన్ ఉంటుంది. పైగా నేనే ఆమెను షూట్ చేసానని కూడా చెప్తాడు. ఆ డెడ్ బాడీని చూసి ఇతను షాక్ అవుతాడు ఎందుకంటే ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. దీనితో వెంటనే కోపంతో టెట్ పై దాడి చేస్తాడు. అయితే పోలీసులు టెట్ వైఫ్ ఇంకా బ్రతికే ఉందని గుర్తించి.. ఆమెను హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. టెట్ ను అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోను పరిచయం చేస్తారు. అతను ఒక లాయర్. ఈ కేసును అతనే హ్యాండిల్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది ? వీరిలో ఎవరు వైపు న్యాయం నిలబడుతుంది ? టెట్ వైఫ్ బ్రతికే ఉంటుందా ? ఈ కేసును డీల్ చేసే విషయంలో హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయి ? ఇవన్నీ తెలియాలంటే ‘ఫ్రాక్చర్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి.