Mini Medaram Jatara: ములుగు మన్నెంలో నేటి నుంచి మేడారం చిన్న జాతర

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ చిన్నజాతర ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. రెండు సంవత్సరాలకోసారి జరిగే మహాజాతర తర్వాత చిన్న స్థాయిలో జరిగే వేడుక.


బుధవారం మండమెలిగే పండుగతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గురువారం మండమెలిగే పూజలు, శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్నజాతర ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 5.30కోట్లు కేటాయించింది. ఈ నిధులతో మౌలిక సౌకర్యాలు కల్పించారు.

ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులుతోపాటు పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది 1000 మందికిపైగా విధుల్లో పాల్గొంటున్నారు.