ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2.10 లక్షల లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasareddy) తెలిపారు.
జూన్ 10 లోగా అర్హులైన మిగతా లబ్ధిదారుల లిస్టు కూడా రెడీ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 42 వేల ఇళ్లను మంజూరు చేయగా.. 24 వేల ఇళ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. సుమారుగా 100 ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధమయ్యాయని, మిగతా ఇళ్లను కూడా అతిత్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు 40 శాతం పేర్లను ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నామన్న మంత్రి పొంగులేటి.. మిగిలిన 60 శాతం ఎంపిక బాధ్యతలను ఇందిరమ్మ కమిటీ (Indiramma Committees)లకు అప్పజెప్పినట్లు చెప్పారు.
మరోవైపు హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఇందిరమ్మ నమూనా మోడల్ హౌస్ (Indiramma Model House)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్ట్ (Gouravelli Project) గురించి ఎవరెవరో మాట్లాడుతున్నారని, కాలువల్ని పూర్తి చేసేందుకు తానెంతో కష్టపడుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా గౌరవెల్లి కాలువల్ని పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు.
































