AP News: సామాన్య కండెక్టర్‌కు ఏపీ మంత్రి ఫోన్.. ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సిందే
తెనాలి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పరుచూరి సుధాకరరావు ఏపీ మంత్రి నుంచి ఫోన్ వచ్చింది. సాధారణ బస్సు కండెక్టర్‌కు మంత్రి ఎందుకు ఫోన్ చేశారు..? తెలుసుకుందాం పదండి…
మీరు ఆర్టిసి బస్సులో ప్రయాణిస్తున్నారా..? అయితే ఆ బస్సు ఎక్కి తీరాల్సిందే… ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా… తెనాలి గుంటూరు మధ్య తిరిగే ఆర్టిసి బస్సులో పరుచూరి సుధాకర్ అనేక కండెక్టర్ పనిచేస్తుంటాడు… అతని కోసమే ఆ బస్సు ఎక్కే ప్రయాణీకులుంటున్నారంటే అతిశయోక్తి కాదు..బస్సు ఎక్కగానే ప్రయాణీకులకు… ఆర్టిసి బస్సు ఎక్కిన మీకు ధన్యవాదాలు అంటూ పలకరిస్తాడు… ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలంటూ అడిగి టికెట్ ఇస్తాడు. అంతేకాదు నెక్స్ట్ వచ్చే స్టాఫ్ గురించి అందరికి వినపడేలా చెబుతాడు. అంతవరకేనా అనకండి తర్వాత స్టాప్ ఎంతసేపటిలో వస్తుందో కూడా అర్దమయ్యాలా వివరిస్తాడు. వీటన్నింటితో పాటు దిగే ముందు థ్యాంక్స్ చెబుతాడు. దీంతో ప్రయాణీకులు సొంత మనిషితో ప్రయాణం చేసినట్లు ఫీల్ అవుతారు. సుధాకర్ తన బస్సులో ప్రయాణించేవారితో ఫ్రెండ్లీ ఉండటమే కాదు.. ఇతర బస్సుల సమాచారం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ప్రయాణీకుల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ఏ బస్సు ఎక్కడుందో వంటి వివరాలను కూడా సోషల్ మీడియాలో ఉంచుతాడు.
ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా సుధాకర్‌కు ఫోన్ చేశారు. మీరు ఆర్టిసికి చేస్తున్న సేవకి ధన్యవాదాలు అంటూ ప్రశంసిచండంతో సుధాకర్ అంతులేని ఆనందాన్ని పొందాడు… తాను ఎన్నో ఏళ్లుగా ఆర్టిసిలో పనిచేస్తున్నానని.. మంత్రి ఫోన్ చేసి తన సేవల్ని మెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఈ విషయం గుంటూరు జిల్లాలోని ఆర్టిసి కార్మికుల్లో కూడా సంతోషాన్ని నింపింది.