ఏపీలో విద్యుత్తు ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..?

డప జిల్లా బద్వేల్ లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా విద్యుత్తు ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయలేదని ఆరోపించారు.

విద్యుత్ శాఖపై రూ. 1.30 లక్షల కోట్ల భారాన్ని మోపిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని.. రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీకి అనువైన ప్రదేశమన్నారు. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. పెట్టుబడులతో పాటు రాయలసీమ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు. 20 లక్షల పీఎం కుసుమ్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గతంలో కూడా స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వం ప్రజలపై తొమ్మిది సార్లు విద్యుత్ భారాలు మోపిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లోపు వీలైనంత వరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జూన్ 27న విశాఖపట్నంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.