ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే.. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ప్రతి ప్రశ్నకు చెప్పిన సమాధానం ఏపీ ప్రజల్లో అనేక అనుమానాలు కలిగించేలా ఉన్నాయి.
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలిసిన జగన్.. తనకు ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై క్లారిటీ ఉన్నప్పటికీ.. యాంకర్ అడిగిన ప్రతిప్రశ్నకు నిజాయితీగా కాకుండా.. తనను సమర్థించుకోవడానికే సమాధానం చెబుతున్నారా అనే విధంగానే ఇంటర్వ్యూ సాగింది. ఐదేళ్ళలో రాష్ట్రంలో వచ్చిన మార్పులు, కేంద్ర రాజకీయాలు, వైసీపీ గెలుుకునే సీట్లు, చెల్లి షర్మిల గురించి అడిగిన ప్రతిప్రశ్నకు ఇష్టం లేనట్లే సమాధానం చెప్పినట్లు కనిపించింది. చేతులారా చెల్లిని దూరం చేసుకున్న జగన్.. తాను తన చెల్లి షర్మిలను మిస్ అవుతున్నా అంటూ చెప్పిన సమాధానంపై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. చెల్లిని కావాలనుకునే వ్యక్తి ఎందుకు దూరం చేసుకున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
చెల్లిని మిస్ అవుతున్నారా..
షర్మిలను మిస్ అవుతున్నారా అంటూ జగన్‌ను యాంకర్ ప్రశ్న వేయగా.. తప్పకుండా.. ఎందుకు కాదంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీని కోసం ఎలా ఆలోచిస్తున్నారని అడగ్గా.. అనుకోకుండా తాను వేరే లైన్ తీసుకుందని సమాధానం చెప్పి చేతులు దులుపుకున్నారు. చెల్లిని మిస్ అయినట్లు అయితే నాలుగేళ్లుగా తన గురించి ఎందుకు పట్టించుకోలేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చెల్లిపై ప్రేమ ఉంటే తనను పిలిచి మాట్లాడిఉండేవాళ్లు కదా.. ఇంటర్వ్యూలో ఏదో చెప్పాలని జగన్ సమాధానం చెప్పినట్లుగానే కనిపించిందని మరికొంతమంది విమర్శిస్తున్నారు. మొత్తానికి ప్రతి ప్రశ్నకు దాటవేసే ధోరణిలోనే సమాధానలు చెప్పినట్లు ఇంటర్వ్యూలో స్పష్టమైంది.