Pinnelli: ఈవీఎం విధ్వంసం కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌

Pinnelli: ఈవీఎం విధ్వంసం కేసులో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌
ఈవీఎంను ధ్వంసం చేసి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్‌ లోకేషన్‌ గురించి మాచర్ల పోలీసులు.. పటాన్‌చెరు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు.
పోలింగ్‌ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు (పోలింగ్‌ కేంద్రం 202)లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.