ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మన పెద్దల మాటలను తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గుర్తుచేశారు. హెల్త్ హై తో సబ్ కుచ్ హై(ఆరోగ్యంగా ఉండే అన్నీ ఉన్నట్లే)అని, ఫిట్‌నెస్‌పై ప్రతీ ఒక్కరూ దృష్టిసారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
అందరూ తమ ఇళ్లల్లో వంటనూనెను తగ్గించాలని విజ్ణప్తి చేశారు. ఊబకాయానికి ఇదే ప్రధాన కారణమన్నారు. దీంతో ఆయిల్ లేకుండా పుడ్ రెడీ చేసుకోవడం ఎలా ఇప్పుడు ప్రజలు ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ చుక్క లేకుండా హెల్తీగా ఉండే లంచ్ రెసిపి ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
నో ఆయిల్ లంచ్ రెసిపి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాజ్మా
-అటుకులు
-జీలకర్ర పొడి
-మిరియాలు
-ఉప్పు
-పచ్చిమిర్చి
-టమాటో
-కొత్తిమీర
-ఉల్లిపాయ
-అవిసె గింజల పొడి
-కీర దోసకాయ
-క్యారెట్
-నిమ్మరసం
నో ఆయిల్ లంచ్ తయారీ విధానం
-1 గ్లాసు రాజ్మాని శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
– తర్వాత నానిన రాజ్మాని కుక్కర్ గిన్నెలో వేసి ఒక గ్లాస్ నీళ్లు అందులో పోసి మీడియం ప్లేమ్ మీద 6-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
-సాఫ్ట్ గా ఉడికిన రాజ్మాని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు మరో గిన్నెలో 1 కప్పు లావు అటుకులు వేసి శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నాననివ్వాలి.
-తర్వాత ఓ బౌల్ లో కచ్చాపచ్చాగా దంచుకున్న 1 టీస్పూన్ మిరియాలు, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ అవిసె గింజల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తం కలిసేలా కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఓ గిన్నెలో తొక్క తీసేసి కట్ చేసిన 1 కీరదోస ముక్కలు, 1 క్యారెట్ ని ముక్కలుగా,1 ఉల్లిపాయ చిన్న ముక్కలు,1 పచ్చిమిర్చి ముక్కలు, 1 టమాటో ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ముందుగా కలిపి ఉంచిన మసాలా పొడిని కొంచెం వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి.
-ఇప్పుడు ఉడికించిన రాజ్మాలో కలిపి ఉంచుకున్న మసాలా పొడి కొంచెం వేసి మొత్తం కలిసేలా కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు నానబెట్టగా పొడి పొడిగా మారిన అటుకుల్లో సరిపడా పెరుగు,ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు పల్లెంలో కట్ చేసి ఉంచుకున్న సలాడ్, పెరుగు కలిపిన అటుకులు,రాజ్మా వేసుకుంటే నో ఆయిల్ లంచ్ రెడీ.