కుటుబంంలో జరుగుతున్న వివాదంతో మోహన్ బాబు ఆవేశపడి మీడియాపై దాడి చేయడం, తన కుమార్తె కోసం ఇంటికి వచ్చిన మంచు మనోజ్ దంపతులపైనా దాడి చేయడంతో ఆయనను పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు మోహన్ బాబు మీడియా ప్రతినిధి వద్ద లాక్కుని చేసిన దాడిలో ఇద్దరకి గాయాలయ్యాయి. వారిద్దరికి తల, చెవి దగ్గర తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ మోహన్ బాబు తమను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మోహన్ బాబు తన ప్రాణానికి గండం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన తీరు చూస్తే ఆయన వల్లనే ఇతరులకు ప్రమాదం పొంచి ఉందని సులువుగా అర్థమైపోతుందని అంచనా వేస్తున్నారు. మంచు మనోజ్, ఆయన భార్య లోపలికి వెళ్తే విష్ణు నియమించిన బౌన్సర్లు వారి పై దాడి చేశారు. ఆయన చొక్కా చింపేసి బయటకు పంపించారు. ఏడు నెలల మనోజ్ కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. తన కుమార్తెను చూడనివ్వకుండా దాడి చేసి పంపేశారని మనోజ్ చెబుతున్నారు.
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు – తీవ్ర ఉద్రిక్తత
మోహన్ బాబు వద్ద గన్ ఉండటం ఆయన దాన్ని స్పాట్ లోకి తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించడంతో వెంటనే ఆయన గన్ లైసెన్స్ రద్దు చేసినట్లుగా సమాచారం ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు గన్ లైసెన్స్ కూడా రద్దు చేసి గన్ స్వాధీనం చేయాలని ఆదేశించారు. మరో వైపు మోహన్ బాబు కుటుంబ వివాదంలో ఇరువైపులా వందల మంది బౌన్సర్లను తెచ్చి ఇంటి చుట్టూ మోహరించినా పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం వివాదాస్పదం అవుతుంది. ఉదయం పోలీసులు మనోజ్ కు చెందిన బౌన్సర్లను పంపించేశారు కానీ విష్ణు తెచ్చిన బౌన్సర్లను మాత్రం పంపలేదు. దీంతో వారంతా కలిసిమీడియాపైనా.. మనోజ్ పైనా దాడి చేశారు.
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు – మీడియాపై దాడి – జల్పల్లిలో టెన్షన్ టెన్షన్
మోహన్ బాబు దాడులు తీవ్రంగా పరిగణించదగ్గ విషయమని పోలీసులు భావిస్తున్నారు. ఆయన దాడి చేశారని మనోజ్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోయినా పోీలీసు ఉన్నతాధికారుల్ని కలిసి తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆయనపై దాడి జరగడాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మోహన్ బాబుపై పలు కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.