Molatadu : మొలతాడు కట్టుకోవడం వెనుక ఉన్న సైన్స్‌ ఏంటో తెలుసా..?

www.mannamweb.com


మగపిల్లలకు మొలతాడు కట్టడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆనవాయితి. ఈ మధ్య కాలుకు నల్లతాడు కట్టుకునే ట్రెండ్‌ బాగా పెరిగింది. నల్లతాడును చాలా మంది స్టైల్‌ కోసమే కట్టుకుంటున్నారు.
అయితే ఇది దిష్టి తగలకుండా కడతారు. మరి మొలతాడు కట్టుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి..? ఇది కూడా దిష్టి తగలకుండానే కడతారా..? అసలు చాలా మంది అబ్బాయిలకు మొలతాడు ఎందుకు కడతారో కూడా తెలియదు. మగాళ్లు అన్నాక మొలతాడు కట్టుకోవాల్సిందే అంటారు.

మొలతాడు ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా సైన్స్ దాగి ఉందంటే అవుననే అంటున్నారు. ఆగమన శాస్త్ర పండితులు. పూర్వ కాలంలో డాక్టర్లు లేరు కాబట్టి ఎవరికైనా పాము, తేలు వంటివి కుట్టిన సమయంలో ఈ మొలతాడు తెంపి కుట్టిన ప్రదేశంలో గట్టిగా కట్టి విషంతో కూడిన రక్తాన్ని తీసేవారు. అలాగే గాయాలు అయిన సమయంలో మొలతాడుతో కట్టే వారు. అలాగే ఆధ్యాత్మికంగా మొలతాడు కట్టుకోవడం వల్ల ఎలాంటి దిష్టి కూడా మనకు తగలదట. అందుకే పూర్వం నుండి మొలతాడు నడుము కడుతున్నారు.

ప్రస్తుతం దిష్టి విషయంలో కాలుకు, చేతికి కూడా నల్లటి దారం కడుతున్నారు. మొలతాడు నడుముకు ధరించడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుందని.. బరువు కూడా అదుపులో ఉంటుందని పలు సైన్స్ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే హెర్నియా అనే వ్యాధి రాకుండా ఉండటానికి కూడా మొలతాడును కట్టుకోవాలని పలువురు సూచిస్తారు.కొన్ని ప్రాంతాలలో మొలతాడు కట్టుకోవడం వల్ల జననావయవాలు ఆరోగ్యంగా ఉంటాయని నమ్ముతారు. ఆ ప్రాంతాలలో పరుషులతో పాటు మహిళలు కూడా మొలతాడును కట్టుకుంటారు. అలాగే గతంలో బెల్ట్ వాడకం లేకపోవడంతో ధరించిన వస్త్రాలు జారిపోకుండా కూడా మొలతాడు ఉపయోగపడేదట.

జాతకం దృష్ట్యా దోషాలు ఉన్న సమయంలో తాయత్తులు కడుతారు. ఆ తాయత్తులు కనిపించకూడదు. కాబట్టి నడముకు మొలతాడు కట్టి దానికి తాయత్తు కట్టేవారట. అలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ఇప్పటికీ కూడా అబ్బాయిలు మొలతాడు కట్టుకుంటారు. మగవారికి మొలతాడు లేకపోతే వారు చనిపోయిన శవంతో సమానమని పెద్దవారు అంటారు.