Money: నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్‌ చేయండి.. సింపుల్‌గా కోటీశ్వరులు కండి

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే ఎక్కువ లాభాలను పొందే ఛాన్స్ ఉంటుంది. అయితే రిటర్న్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది.
కాబట్టి నష్టభయం తక్కువగా ఉంటూ ఎక్కువ రిటర్న్స్ అందించే మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు. మీరూ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని చూస్తున్నారా? బెస్ట్‌ ఫండ్‌ కోసం వెతుకుతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. నెలకు కేవలం రూ.3 వేలు సిప్ చేస్తే రూ.1 కోటి సంపాదించొచ్చు. ఆ మ్యూచువల్‌ ఫండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కరోడ్‌పతి మ్యూచువల్ ఫండ్
మ్యూచువల్ ఫండ్లలో ఈ మధ్య సెక్టోరల్ లేదా థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. ఏదైనా ఒక రంగానికి సంబంధించిన స్టాక్స్‌లోనే పూర్తి పెట్టుబడులు పెట్టడమే సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ ఉద్దేశం. ఐటీ, బ్యాంక్‌లు, ఫైనాన్స్, డిజిటల్ వంటి రంగాలకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ స్కీమ్స్ అద్భుతమైన రిటర్న్స్ అందిస్తూ స్మాల్ సిప్‌లను సైతం కోట్ల ఆస్తిగా మారుస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్- రెగ్యులర్ ప్లాన్ అనే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ చాలా పాపులర్‌ అయింది. ఊహించని రిటర్న్స్‌ని అందిస్తూ కరోడ్‌పతి మ్యూచువల్ ఫండ్‌గా గుర్తింపు పొందింది.

ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ 2020 జనవరిలో లాంఛ్ అయింది. ఇదొక ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. అంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు యూనిట్స్‌ని అమ్మవచ్చు, కొనవచ్చు. పైగా వీటిలో కచ్చితంగా ఇంతే ఇన్వెస్ట్ చేయాలన్న లిమిట్ ఏమీ ఉండదు. మెచ్యురిటీ డేట్ కూడా ఉండకపోవడంతో ఎన్నేళ్లయినా ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇంతటి ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టే ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తోంది. 2024 డిసెంబర్ 31 నాటికి ఈ స్కీమ్ ఏకంగా రూ.5,325 కోట్ల అస్సెట్స్‌ని కలిగి ఉంది. గత 10 ఏళ్లలో ఈ స్కీమ్ 18.07 శాతం రిటర్న్స్ సాధిస్తే.. చివరి 7 ఏళ్లలో 21.58 శాతం రిటర్న్స్‌ని డెలివరీ చేయడం గమనార్హం.

ఎంత లాభం వస్తుందంటే?
ఉదాహరణకు ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కింద నెలకు రూ.3,000 సిప్ చేశారని అనుకుందాం. 25 ఏళ్ల పాటు ఇలా పెట్టుబడి పెడితే, మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ రూ.9 లక్షలకు చేరుకుంటుంది. ఈ లెక్కన ప్రతి ఏడాదికి 16.9 శాతం రిటర్న్స్‌ని బట్టి కాలిక్యులేట్‌ చేస్తే, అమౌంట్ మొత్తం రూ.1,12,82,322 వరకు చేరుకుంటుంది. అంటే రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 10 రెట్లకు పైగా అమౌంట్ మీ చేతికి అందుతుంది.

సక్సెస్ సీక్రెట్ ఇదే
ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఇంత బాగా పర్ఫార్మ్ చేయడానికి కారణం, ఇందులోని స్టాక్ లిస్టే. ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతి ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటివి ఇందులో టాప్ స్టాక్స్‌గా ఉన్నాయి. 2024 డిసెంబర్ వరకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్- రెగ్యులర్ ప్లాన్ కింద ఈక్విటీలో 99.13 శాతం, 0.87 శాతం క్యాష్ అండ్ క్యాష్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు.