మన దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఇప్పటికి వాస్తు శాస్త్రాన్ని చాలామంది గట్టిగా నమ్ముతుంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ఈక్రమంలోనే వాస్తు ప్రకారం ఇళ్లు నిర్మించిడం దగ్గర నుంచి, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉంచితే లాభం కలుగుతుందోనని పది రకాలుగా ఆలోచిస్తుంటారు. అలాగే ఈ విషయంలో..కొన్ని సార్లు జ్యోతిష్య నిపుణుల సలహాలను, సంప్రాదింపులను కూడా చేస్తుంటారు. ఎందుకంటే..చాలా ఇళ్లలో ఈ వాస్తు దోషాల వలన.. ఎంత సంపాదిస్తున్న డబ్బు నిలవకపోవడం వంటి ఏదో కారణాలతో అనేక నష్టాలు వాటిల్లుతాయి. అలాంటి సమయంలో.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది బలంగా నమ్ముతారు. మరి అలాంటి ఆద్భుతమైన వస్తువుల్లో ఈ క్రిస్టల్ తాబేలు కూడా ఒకటి. అయితే దీనిని ఇంట్లో ఆ చోట పెట్టుకుంటే..ఇంట్లో ఊహించని మ్యాజిక్ జరగడంతో పాటు ఆకస్మిక లాభాలు పొందవచ్చు. ఇంతకి వాస్తు ప్రకారం ఈ క్రిస్టల్ తాబేలును ఎక్కువగా వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసుకుందాం.
మనలో ఇప్పటికి చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిఒక్కరూ ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని గట్టిగా నమ్ముతుంటారు. మరి అలాంటి వస్తువుల్లో ఈ క్రిస్టాల్ తాబేలు బొమ్మ కూడా ఒకటి. దీనిని ఇంట్లో పెట్టుకుంటే అనేక లాభాలు పొందవచ్చని అందరూ నమ్ముతుంటారు. అయితే ఈ క్రిస్టల్ తాబేలును ఎక్కువగా వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసుకుందాం.అయితే వాస్తు ప్రకారం ఈ క్రిస్టల్ తాబేలును దక్షిణ దిక్కులో ఇంట్లో పెట్టుకుంటే మంచి పాజిటీవిటీ పెరుగుతుంది. అలాగే, బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే.. మంచి నిద్ర లభిస్తుందట. దీంతో నిద్ర సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా.. క్రిస్టల్ తాబేలును పూజగదిలో పెట్టుకుంటే.. ఇంటికి చాలా మంచిది. అది కూడా పసుపు రంగు క్లాత్‌లో చుట్టి పెడితే మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా.. గుమ్మంకు ఎదురుగా క్రిస్టల్ తాబేలును ఉంచుకుంటే.. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు. ఇక ఇంట్లో సంపాదన పెరగాలి అనుకునేవారు.. క్రిస్టల్ తాబేలును లాకర్‌లో పెట్టుకుంటే.. ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. సులభంగా డబ్బును ఆకర్షిస్తుంది. అలాగే వారి ఇంట్లో ఎల్లప్పుడు సంపాద అనేది క్రమంగా పెరుగుతు ఉంటుంది. ఇక వారకి ఆర్థిక ఇబ్బందులనేవి దరిదాపుల్లో చేరవు.