మీ దగ్గర డబ్బులు ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే దాచుకున్న డబ్బు అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అదే ఏదైనా మంచి స్కీమ్ చూసి అందులో పెడితే డబ్బు సంపాదన ఇంకా పెరుగుతుంది.
అదేలా అనుకుంటున్నారా పోస్ట్ అఫీస్‌లో మీ కోసం మంచి స్కీమ్ ఉంది. అదే స్కీమ్‌లో మీ భాగస్వామితో కలిసి పెడితే మరింత మంచిది. ఏకంగా నెలకు రూ. 9250 మొత్తాన్ని పొందవచ్చు. ఇది నెల జీతం కాదు, నెల నెల అదనపు ఆదాయం. ఇందుకు మీరు మీ భాగస్వామితో కలిసి పోస్ట్ ఆఫీసులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ద్వారా మీరు మంచి రాబడిని పొందవచ్చు.
మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలంటే పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ ఒక మంచి ఎంపిక. ఇది చాలా సంవత్సరాలుగా సుపరిచితమైన, నమ్మకమైన పథకం. ఇందులో మీరు పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు పెట్టి ప్రతి నెలా వడ్డీ ఆదాయం పొందవచ్చు. ఇది మీరు ఇంట్లో కూర్చొని చేసుకునే ఒక అందమైన ఆప్షన్. ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసిన మొత్తంపై ప్రతి నెలా ఆదాయం అందుతుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా మీకు ప్రతి నెలా వడ్డీ కలిగిస్తుంది. మీరు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే, డిపాజిట్ పరిమితి పెరిగి, మరింత ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ స్కీమ్‌లో సింగిల్ ఖాతాలో 9 లక్షల వరకు, జాయింట్ ఖాతాలో 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయడం ద్వారా, మీరు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. ఉదాహరణకు, మీరు మీ భాగస్వామితో కలిసి జాయింట్ ఖాతాను ఓపెన్ చేస్తే, మీరు 15 లక్షలు డిపాజిట్ చేయడానికి అర్హులు అందుకు మీకు 7.4% వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ.9,250 వడ్డీ వస్తుంది. ఈ విధంగా, ప్రతి ఏడాది మీరు రూ. 1,11,000 వడ్డీ ఆదాయం పొందవచ్చు. మీరు 5 సంవత్సరాలపాటు ఈ పథకంలో డబ్బు పెట్టుకుంటే, రూ. 5,55,000 వడ్డీ సంపాదించవచ్చు. ఒకే ఖాతాను ఓపెన్ చేసి డిపాజిట్ చేయాలంటే గరిష్టంగా రూ. 9 లక్షలు మాత్రమే పెట్టవచ్చు. అప్పుడు మీరు నెలవారీ రూ. 5,550 వడ్డీ పొందవచ్చు. అంటే ఏడాదిలో రూ. 66,600 వడ్డీ వస్తుంది. దీనిలో 5 సంవత్సరాలలో మీరు రూ. 3,33,000 సంపాదించవచ్చు.
మీ పిల్లల వయస్సు 10 సంవత్సరాలు కంటే తక్కువ ఉంటే, వారు వారి పేరుతో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. 10 సంవత్సరాలు నిండిన తర్వాత, వారు స్వయంగా తమ ఖాతాను నిర్వహించుకునే హక్కు పొందుతారు. ఇది కేవలం మీ సంపద పెంచే ఒక బహువిధ ఆప్షన్ మాత్రమే కాదు, అది మీ కుటుంబం యొక్క భవిష్యత్తు భద్రత కూడా అవుతుంది. ఈ పథకం ద్వారా మీరు మీ పొదుపులను సురక్షితంగా పెంచి, మంచి ఆదాయాన్ని పొందవచ్చు.