త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి లోకేశ్

మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకం పెండింగ్‌ ఉన్న దరఖాస్తులకు లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు విడుదల చేసే ఫైలుపై సంతకం చేశారు.


దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమ కానున్నాయి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.