ప్రతి 3 నెలలకు ఒకసారి మీ ఖాతాలోకి డబ్బు.

 మధ్యకాలంలో చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. రిస్క్ తక్కువ మంచి ఆదాయం ఉండడమే దీనికి కారణం. ఇక రిటైర్మెంట్ తర్వాత తమ జీవిత కాల సంపాదనను సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలని ఆశించే వారికి పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక అద్భుతమైన ఎంపిక.


ప్రభుత్వ భరోసా ఉండటమే కాకుండా ప్రస్తుతం ఈ స్కీమ్ బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీని అందిస్తోంది.

అధిక వడ్డీ రేటు.. నమ్మకమైన రాబడి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి గాను ప్రభుత్వం ఈ పథకంపై 8.2శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం నేరుగా వారి ఖాతాలో జమ అవుతుంది. ఇది వారి రోజువారీ అవసరాలకు స్థిరమైన ఆర్థిక భరోసానిస్తుంది.

పెట్టుబడి పరిమితులు – పన్ను ప్రయోజనాలు

పెట్టుబడి: ఈ పథకంలో కనీసం రూ.1,000 నుండి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

పన్ను మినహాయింపు: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. అందుకే ఇది పన్ను ఆదా చేయాలనుకునే వారికి ఉత్తమ మార్గం.

మెచ్యూరిటీ కాలం: ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఒకవేళ పెట్టుబడిదారులు కోరుకుంటే, మెచ్యూరిటీ తర్వాత మరో 3 సంవత్సరాల పాటు దీనిని పొడిగించుకోవచ్చు.

ముందస్తు ఉపసంహరణ నిబంధనలు

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే ముందస్తు ఉపసంహరణ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే, దీనిపై కొంత జరిమానా విధిస్తారు.

ఒక సంవత్సరం లోపు: నగదు ఉపసంహరించుకుంటే ఎటువంటి వడ్డీ లభించదు.

1 నుండి 2 ఏళ్ల మధ్య: అసలు మొత్తంలో 1.5శాతం జరిమానా విధిస్తారు.

2 నుండి 5 ఏళ్ల మధ్య: అసలు మొత్తంలో 1శాతం జరిమానా విధిస్తారు.

ఉమ్మడి ఖాతా సదుపాయం

భార్యాభర్తలు కలిసి ఉమ్మడి ఖాతాను ప్రారంభించే అవకాశం ఉంది. దీనివల్ల పెట్టుబడి పరిమితిని సమర్థవంతంగా వినియోగించుకోవడమే కాకుండా కుటుంబానికి ఎక్కువ ఆర్థిక భద్రత లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.