ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా? ఇలా చేస్తే చిటికలో దోమలు మాయం

www.mannamweb.com


వర్షాకాలం, చలికాలం అంటే అందరికీ ఇష్టమే.. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అదే సమయంలో దోమల గోలను కూడా భరించలేము. చలికాలం సమయంలో ప్రతి ఒక్కరూ దోమల కాయిల్స్ వెనకాల పరుగులు పెట్టాల్సిందే.
అయితే ఈ విధంగా కాయిల్స్ వెలిగిస్తే దానివల్ల నెగటివ్ ఎఫెక్టులు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో చిటికెలో దోమల్ని పోగొట్టడం ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.

వీటి కోసం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఇంట్లో ఉండే వస్తువులతోనే రెండు నిమిషాల్లో ఈ చిట్కా తయారు చేయొచ్చు. లవంగాలు, ప్రతి ఇళ్లలో ఉండే పదార్థమే. అయితే లవంగాలను వంటలోనే కాకుండా ఇలా దోమలను తరిమికొట్టడంలో కూడా వాడొచ్చు అని అందరికీ తెలీదు. లవంగాలలో నుంచి వచ్చే సుగందాలు దోమలను తరిమి కొట్టడానికి చాలా ఉపయోగపడతాయి.

లవంగాలను కాల్చితే దాని నుంచి వచ్చే పొగ వల్ల దోమలు పారిపోతాయి. దీంతోపాటు కర్పూరం కూడా ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే పదార్థమే. కర్పూరం ని దంచి నూనెలో వేసి ఆ నూనెని ఒంటికి రాస్తే దోమలు కుట్టే ప్రసక్తే ఉండదు. అలాంటి కర్పూరం, లవంగాలను కలిపి ఒక చిట్కా చేస్తే దోమల జాడ మన దరిదాపుల్లో కనిపించదు. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు మూడు కర్పూరాలతో పాటు ఒక నాలుగు ఐదు లవంగాలను పెట్టి కర్పూరాన్ని వెలిగిస్తే ఆ కర్పూరపు మంట లవంగాలను తాకి దాని సుగందాలను విడుదల చేస్తుంది.

ఒక ఐదు నిమిషాల వరకు ఆ పొగ గదంతా తాగితే దోమలు దరిదాపుల్లోకి కూడా రావు. ఇంత తేలికైనా చిట్కాతో వర్షాకాలంలో దోమల బాధ నుంచి తేలిగ్గా తప్పుకోవచ్చు. దోమలు కుడితే చర్మానికి వచ్చే ఆ మంట భరించడం చాలా కష్టం కనుక ఈ చిట్కా వాడితే దోమల నుంచి తేలిగ్గా తప్పించుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.