23 ఏళ్ల వయసులోనే 50కి పైగా సినిమాలు ఇ గ్లామర్ క్వీన్.. ఎవరో తెలుసా

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. కేవలం 23 వయసులోనే దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. టెలివిజన్ షోల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు సినిమాల్లో కూడా చురుగ్గా ఉన్న ఈ బ్యూటీ.. చాలా మంది ప్రముఖ నటీమణుల ఖ్యాతిని అధిగమించింది. ఆమె మరెవరో కాదు.. అవనీత్ కౌర్. అమాయకమైన ముఖంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అవనీత్ కౌర్ నేడు తన ఆకర్షణీయమైన లుక్స్, నటనతో లక్షలాది మంది అభిమానులను ఆకర్షించింది. ఒకప్పుడు టెలివిజన్ కి డార్లింగ్ గా పేరుగాంచిన ఆమె నేడు స్టైలిష్ ఐకాన్ గా ఎదిగింది.


అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ బ్యూటీ.. బాలనటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘డాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్’ షోలో పాల్గొని ఆమె అందరినీ ఆకట్టుకుంది. బుల్లితెరపై అనేక విజయవంతమైన షోలలో నటించిన తర్వాత సినిమాల్లో తనదైన ముద్ర వేసిన అవనీత్ కౌర్ సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె చేసే ప్రతి పోస్ట్‌కి లక్షలాది లైక్‌లు వస్తున్నాయి. తన స్టైలిష్ లుక్స్‌తో యువతకు ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన అవనీత్ కౌర్, 23 సంవత్సరాల వయసులో 50 కి పైగా సినిమాలు, షోలు, పాటల్లో కనిపించింది.

సోషల్ మీడియాలో తన జీవిత విశేషాలను అభిమానులతో క్రమం తప్పకుండా పంచుకునే అవనీత్ కౌర్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అవనీత్ కౌర్, అనేక ప్రముఖ కంపెనీలకు అంబాసిడర్‏గా వర్క్ చేస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.