కేంద్ర ప్రభుత్వ’ముద్రా’లోన్ పొందడం ఎలా?

కేంద్ర ప్రభుత్వం 2015లో ముద్రా పథకం (PMMY – Pradhan Mantri Mudra Yojana)తెచ్చింది. ఈ స్క్రీం ద్వారా చిన్న, సూక్ష్మ వ్యాపారాలు, స్వయం ఉపాధి చేసుకునే వారికి ఎలాంటి హామీ (కొల్లాటరల్) లేకుండా రుణాలు అందిస్తారు.


MUDRA అంటే Micro Units Development & Refinance Agency. ఈ పథకం ద్వారా షాపులు, చిన్న తయారీ యూనిట్లు, సర్వీస్ సెక్టార్, చేతివృత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి నాన్-ఫార్మ్ ఆదాయ కలిగించే కార్యకలాపాలకు రుణ సహాయం లభిస్తుంది.

2024 బడ్జెట్‌లో ముద్రా లోన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. ఇది మహిళలు, యువత సహా లక్షలాది మందికి ఉపయోగపడుతోంది. దాదాపు 60% లబ్ధిదారులు మహిళలే! ఈ యోజన కింద మూడు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి.

ముద్రా లోన్ రకాలు:

1. శిశు (Shishu): రూ.50,000 వరకు – కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి ఈ లోన్ ఇస్తారు

2. కిషోర్ (Kishor): రూ.50,001 నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారాన్ని విస్తరించేవారికి ఈ రుణం లభిస్తుంది

3. తరుణ్ (Tarun): రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు (కొన్ని కేసుల్లో రూ.20 లక్షల వరకు, ముందు తరుణ్ లోన్ తీర్చినవారికి) ఇస్తారు

అదనంగా ‘తరుణ్ ప్లస్’ కేటగిరీలో రూ.20 లక్షల వరకు లభిస్తుంది.

అర్హతలు:

భారతీయ పౌరుడు అయి ఉండాలి

వయసు కనీసం 18 ఏళ్లు

నాన్-ఫార్మ్ ఆదాయ కలిగించే వ్యాపారం (మాన్యుఫాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్) ఉండాలి. లేదా ప్రారంభించాలనుకోవాలి

ఎలాంటి డిఫాల్ట్(రుణం ఎగ్గొట్టిన) చరిత్ర ఉండకూడదు

ముద్రా లోన్ ఎలా పొందాలి?

సమీప బ్యాంక్/NBFC/MFIని సంప్రదించండి: పబ్లిక్/ప్రైవేట్ బ్యాంకులు (SBI, HDFC, ICICI మొదలైనవి), రీజనల్ రూరల్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ముద్రా లోన్లు ఇస్తాయి.

ఆన్‌లైన్ అప్లికేషన్:

www.udyamimitra.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. శిశు/కిషోర్/తరుణ్ కేటగిరీ ఎంచుకోండి.

ఆఫ్‌లైన్:

బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ముద్రా అప్లికేషన్ ఫారమ్ తీసుకుని నింపండి.

అవసరమైన డాక్యుమెంట్లు:

గుర్తింపు రుజువు (ఆధార్, పాన్, వోటర్ ID)

చిరునామా రుజువు:

వ్యాపార ప్రణాళిక (సింపుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)

ఫోటోలు, బ్యాంక్ స్టేట్‌మెంట్ (కొన్ని కేసుల్లో)

కుల/కేటగిరీ సర్టిఫికేట్ (అవసరమైతే)

లోన్ మంజూరైన తర్వాత ముద్రా కార్డు (RuPay డెబిట్ కార్డు) లభిస్తుంది. దీనితో వర్కింగ్ క్యాపిటల్ సులభంగా ఉపయోగించవచ్చు. వడ్డీ రేట్లు బ్యాంకు ఆధారంగా మారుతాయి, కానీ సహేతుకంగా ఉంటాయి. మరిన్ని వివరాలకు సమీప బ్యాంక్ లేదా www.mudra.org.in సందర్శించండి.

Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహా కాదని పాఠకులు గమనించాలి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు,  మీ వ్యాపార, పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తే మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.