Mudra Loan : 20 లక్షల ముద్ర లోన్ ఎవరు అర్హులు?? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ సమర్పించిన క్రమంలో ముద్రా రుణాన్ని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించారు.
చిన్న తరహా సంస్థలు, చిన్న వ్యాపారులకు ఆర్థికంగా మద్దతు అందించడం, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్‌ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ముద్ర యోజన- PMMY అనే స్కీమ్‌ను 2015లో ప్రవేశపెట్టింది. MUDRA అంటే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అని అర్ధం. వ్యవసాయేతర రంగాల్లో నిమగ్నమై ఉన్న చిన్న తరహా సంస్థలు, వ్యక్తులకు లోన్లు అందించడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం.
ఈ స్కీం కింద ఇప్పటికే లక్షల కోట్ల రుణాల్ని మంజూరు చేశాయి బ్యాంకులు. ఈ స్కీం కింద ఏకంగా 40 కోట్ల మందికిపైగా లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే స్వయంగా వెల్లడించింది.కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకు వారి కోసం, వ్యాపార విస్తరణ కోసం ఆర్థిక చేయూత అందించడానికి రూ. 10 లక్షల దాకా తనఖా/ష్యూరిటీ లేని లోన్లు అందించేందుకు 2015, ఏప్రిల్ 8న పీఎం నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ప్రారంభించారు. ట్రేడింగ్, సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా పీఎం ముద్ర లోన్ పొందే అవకాశం ఉంటుంది.ఇంకా అలాగే కొత్త వారికి కూడా లోన్ పొందే అవకాశం ఉంది.
ఇక తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో కేంద్రం ఈ రుణాన్ని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది. ఇప్పుడు 50 వేలు నుంచి 20 లక్షల వరకు ఈ లోన్ ని పొందవచ్చు. ఇందులో ఎలాంటి ష్యూరిటీ కానీ తనఖా కానీ అవసరం లేదు. ఇక ఈ ముద్ర రుణాలను బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఇంకా మైక్రో ఫైనాన్స్ సంస్థలు అందిస్తాయి. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, కోఆపరేటివ్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ లోన్లని అందిస్తాయి. అయితే మీరు దీనికి దరఖాస్తు చేసుకుంటే.. ఎంత డబ్బు కావాలని మీరు దరఖాస్తు చేసుకున్నారో దానిలో 10శాతం మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 90శాతం ఇందులో రుణంగా మంజూరు చేస్తారు.
మీరు ఈ పీఎం ముద్ర లోన్ కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం https://www.udyamimitra.in/ వెబ్ సైట్లో కి వెళ్లి, అందులో
ముద్ర లోన్స్
అనే ఆప్షన్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ తరువాత ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇతర బిజినెస్ పత్రాలు(బ్యాంక్ స్టేట్ మెంట్, ఐటీఆర్, పాన్ కార్డు వంటివి) సమర్పించి లోన్ అప్లై చేసుకోవచ్చు.