Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ..! ఒకే చెప్పేశారు.. ఆ రోజే చేరిక..!

www.mannamweb.com


Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
ఆ మధ్య జనసేనలోకి వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఆయన్ని.. పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది.. కానీ, ఏం జరిగిందో తెలియదు.. ఈ వ్యవహారంలో ఎలాంటి ముందుడుగు పడలేదు.. ఆ తర్వాత ఈ పరిణామాలపై ముద్రగడ పద్మనాభం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ నెల 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు.
అయితే, ఇప్పుడు పోటీ చేసే అవకాశం లేకపోయినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముద్రగడ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారట మిథున్ రెడ్డి.. ఇక, మీరు అడుగుతున్నారా? లేక సీఎం జగన్ అడగమన్నారా? అని మిథున్ రెడ్డిని ప్రశ్నించారట ముద్రగడ.. దీంతో.. సీఎం అడగమన్నారని మిథున్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా చెబుతున్నారు. అయితే, పార్టీలో జాయినింగ్ కి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, పోటీ చేసే స్థానం విషయంలో కూడా గెలుపు ఓటములను అంచనావేసి నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారట ముద్రగడ.. సీఎంకు విషయం చెప్పి స్పష్టత ఇవ్వాలని మిథున్‌రెడ్డిని కోరారట.. అన్ని ఓకే అనుకుంటే సిద్ధం సభలో జాయినింగ్ పెట్టుకుందామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ముందు సీఎం జగన్‌ కి చెప్పండి.. ముహూర్తం బట్టి చూద్దాం అని ముద్రగడ చెప్పినట్టుగా వైసీపీ నేతలు తెలిపారు.. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే జాయినింగ్ ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ముద్రగడ కుమారుడు గిరి పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.