Mudupu: అసలు ముడుపు అంటే ఏమిటి? వేంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి?

www.mannamweb.com

Mudupu: చాలా మంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామి వారికి ముడుపు కడతారు. అసలు ఈ ముడుపు అంటే ఏంటి? వేంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అనే దాని గురించి చిలకమర్తి వివరించారు.
మానవులు తమ జీవితములో ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి. ఇలా ధర్మబద్ధంగా ఆచరించే కార్యములు తీరడానికి లేదా సఫలీకృతం అవ్వడానికి ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి. ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ధర్మబద్ధమైన కోరికలు అనగా పిల్లలకు మంచి విద్య కలగడం, సంతానం లేనివారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలగాలని, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం పొందాలని, అవివాహితులకు వివాహం కలగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని చిలకమర్తి తెలిపారు.

వేంకటేశ్వరస్వామికి ముడుపు కట్టాలని అనుకుంటే శనివారం రోజు ఉదయం ముందుగా వినాయకుడికి పూజ చేసి తర్వాత నిత్య దీపారాధన చేయాలి. మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలి అని కోరుకోవాలి.

ఒక తెల్లటి వస్త్రం తీసుకుని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టాలి. ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో 11 రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనఃస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి వారి ఫోటో ముందు పెట్టాలి.

కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.