దోసకాయ విషయంలో అన్నాచెల్లెళ్ళ మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి ఏకంగా సొంత చెల్లెలినే దారుణంగా హత్య చేసిన సంఘటన చామరాజనగర్(Chamarajanagar) జిల్లాలో చోటు చేసుకుంది.
దోసకాయ విషయంలో అన్నాచెల్లెళ్ళ మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి ఏకంగా సొంత చెల్లెలినే దారుణంగా హత్య చేసిన సంఘటన చామరాజనగర్(Chamarajanagar) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొళ్ళేగాల ఈద్గా మొహల్లా వీధిలో నివసించే సయ్యద్ పాషా(Sayed Pasha) ఇంట్లో బుధవారం రాత్రి దారుణం జరిగింది. రాత్రి భోజనం వేళ చెల్లెలు ఇమాన్‌భాను అన్న కుమారుడికి దోసకాయ తినిపించేందుకు ప్రయత్నించారు.
పిల్లాడికి జ్వరం వస్తోందని దోసకాయ ఇవ్వరాదంటూ అన్న ఫర్మాన్ మందలించారు. ఇదే విషయంలో అన్నాచెల్లెళ్ళ మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. అంతలోనే ఆగ్రహానికి లోనైన ఫర్మాన్ ఏకంగా కత్తి తీసుకువచ్చి ఇమాన్‌భాను(Imanbhanu) గొంతుకోసి హతమార్చాడు. కేకలతో పాటు రాద్దాంతం కావడంతో మరోగదిలో ఉండే ఫర్మాన్ భార్యతో పాటు తండ్రి అడ్డుకునేందుకు రాగా వారిపైనా దాడికి పాల్పడ్డారు.
ఇంట్లో తీవ్రమైన కేకలు వినిపిస్తుండటంతో స్థానికులు రాగా ఫర్మాన్ ఓగదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. వెంటనే గాయపడిన ఇద్దరినీ చామరాజనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈలోగానే పోలీసులకు ఫోన్ చేసి ఫర్మాన్ లొంగిపోయారు. కొళ్ళేగాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.