ఆవాల నూనె గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు అందరి ఇంట్లో కూడా ఆవాలు ఉంటాయి. ప్రతి వంటకంలోనూ ఆవాలను వాడుతూ ఉంటారు.
ఆవాలతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాలనే కాకుండా ఆవాల నూనె కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా ఆవాల నూనెను పలు రకాలా వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు.
ఆవాల నూనెలో కూడా ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వం అయితే ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించే వారు. అదే విధంగా శీతా కాలంలో ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. అలా అయితేనే రోగాలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా శీతా కాలంలో ఆవాల నూనెను ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది:
ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించి తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
రక్త పోటు తగ్గించుకోవచ్చు:
అధిక రక్త పోటు సమస్య ఉన్నవారు ఆవాల నూనె వాడటం చాలా మంచిది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రక్త పోటును అదుపు చేయవచ్చు.
రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది:
ఆవాల నూనె తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది మెరుగు పడుతుంది. దీంతో వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు.
జీర్ణ శక్తి మెరుగు పడుతుంది:
ఆవాల నూనె తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణ శక్తి అనేది మెరుగు పడుతుంది. తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి:
ఆవాల ఆయిల్ ఉపయోగించడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అదే విధంగా శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు కూడా ఆవాల ఆయిల్ వాడటం మంచిది. అదే విధంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటే అవకాశాలు ఉంటాయి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.