ప్రస్తుత కాలంలో భారతీయ పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్ చేరువయ్యాయి. చాలా మంది వీటిపై అవగాహన పెంచుకోవటంతో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపుతున్నారు.
ఈ క్రమంలో చిన్న ఇన్వెస్టర్ల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకు అందరూ ఎస్ఐపీలను తమ పెట్టుబడి ప్రయాణం కోసం ఎంచుకుంటున్నారు.
క్రమబద్ధంగా ఎస్ఐపీ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించిన వ్యక్తులు భారీగా లాభాలను ఆర్జించినట్లు ఫండ్స్ పనితీరు చూస్తే తెలుస్తుంది. అయితే ఇలా కోటీశ్వరులుగా కూడా మారవచ్చా అనే ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఈ క్రమంలో నెలకు రూ.18 వేలు పెట్టుబడిగా పెడితే చేతికి పెట్టుబడిదారులు ఒక్కసారిగా రూ.21 కోట్లు ఎలా పొందగలరనే విషయాన్ని పరిశీలిద్దాం. కాంపౌండింగ్ దీర్ఘకాలంలో పెట్టుబడిదారులను తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి ఎలా దోహదపడుతుందో తప్పక తెలుసుకోవాలి.
ఎస్ఐపీ అనేది స్థిరమైన సమయంలో కొనసాగించే పెట్టుబడి. ఇది రోజు, నెలవారీ, వారం, త్రైమాసికం లేదా వార్షికంగా కూడా ఉండవచ్చు. సాధారణంగా ఎక్కువ మంది నెలవారీ పెట్టుబడి ఎంపికకు మెుగ్గుచూపుతుంటారు. చిన్న మెుత్తాల్లో పొదుపు చేయటాన్ని నిరంతరం కొనసాగించటం వల్ల చివరికి మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. అందుకే సెబీ కూడా సామాన్యులకు ఈ పెట్టుబడి మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి కనీస పెట్టుబడి మెుత్తాన్ని రూ.100కి తగ్గించింది. ఇందుకోసం చాలా మంది నెలలో నచ్చిన తేదీకి ఆటో డెబిట్ ఎంపికను ఎంచుకుంటుంటారు.
పెట్టుబడుల విషయంలో నిపుణులు ఎల్లప్పుడూ సూచించేది ఒక్కటే వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయటం ప్రారంభించమని. యువత దీనిని అర్థం చేసుకుని తమకు ఉద్యోగం వచ్చిన వెంటనే పెట్టుబడులను ప్రారంభించటం ద్వారా తక్కువ మెుత్తంతో ఎక్కువ కార్పస్ రూపొందించటానికి వెసులుబాటు ఉంటుంది. మార్కెట్లలో ముఖ్యమైనది ఏ సమయంలో పెట్టుబడి పెడుతున్నాం అన్నదేననే విషయాన్ని మరచిపోకూడదు.
నెలకు రూ.18 వేల ఎస్ఐపీతో కోట్లు..
అయితే ఇప్పుడు నెలకు స్థిరంగా రూ.18,000 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిని కొనసాగించటం ద్వారా రూ.21 కోట్లను పొందవచ్చు. దీనికి సంబంధించిన లెక్కలను పరిశీలిస్తే.. వార్షికంగా పెట్టుబడిపై 12 శాతం రాబడిని పరిగణిస్తే ఒక పెట్టుబడిదారు 40 ఏళ్లపాటు దీనిని కొనసాగిస్తే తప్పకుండా రూ.21 కోట్లను రాబడిగా పొందటానికి వీలు ఉంటుంది. అలాగే ఇదే మెుత్తాన్ని 10 ఏళ్ల కాలానికి కొనసాగించినట్లయితే వారు రూ.41,82,103 మెుత్తాన్ని చివరికి పొందే అవకాశం ఉంటుంది. 30 ఏళ్ల కాలంలో ఇది ఇచ్చే రాబడి రూ.6.33 కోట్లుగా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఎంత ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగిస్తూ ఉంటే కాంపౌండింగ్ వల్ల అంత అధికంగా రాబడులను ఇన్వెస్టర్లు పొందుతారనే.