డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ

www.mannamweb.com


వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోన్న తెలుగు మూవీ కానిస్టేబుల్ కనకం డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తోన్నాడు.

థియేటర్లను స్కిప్ చేస్తూ కానిస్టేబుల్ కనకం మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.

ఫస్ట్ లుక్ రిలీజ్‌…

కానిస్టేబుల్ కనకం ఫస్ట్ లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఖాకీ డ్రెస్‌లో వర్ష బొల్లమ్మ సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. ఆమె వెనుక కొబ్బరి తోటలతో నిండిపోయిన ఓ ప్రాంతం కనిపించడం ఆసక్తిని పంచుతోంది.

అడవి గుట్టలో ఏం జరిగింది?

అడవిగుట్ట అనే ప్రాంతం నేపథ్యంలో కానిస్టేబుల్ కనకం మూవీ సాగనున్నట్లు డైరెక్టర్ తెలిపాడు. అడవిగుట్ట మిస్టరీని కనకం అనే కానిస్టేబుల్ ఎలా సాల్వ్ చేసింది అన్నది సినిమాలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగనున్నట్లు సమాచారం. సోమవారం నుంచి కానిస్టేబుల్ కనకం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు.

సురేష్ బొబ్బిలి మ్యూజిక్‌…

కానిస్టేబుల్ కనకం మూవీలో రాజీవ్ కనకాలతో పాటు పలువురు టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టులు కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తోన్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తోన్నాడు.

శ్రీదేవి శోభన్‌బాబు…

ప్రశాంత్ కుమార్ దిమ్మలకు దర్శకుడిగా ఇది సెకండ్ మూవీ. గత ఏడాది రిలీజైన శ్రీదేవి శోభన్‌బాబు మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ మూవీని చిరంజీవి కూతురు సుష్మిత ప్రొడ్యూసర్ చేసింది.

96తో ఫేమస్‌…

విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ 96 తో కోలీవుడ్‌లో లైమ్‌లైట్‌లోకి వచ్చింది వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత 96 తెలుగు రీమేక్‌గా వచ్చిన జానులోనూ సేమ్ రోల్ చేసింది. చూసీ చూడంగానే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ పలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్షకులను మెప్పించింది. మిడిల్ క్లాస్ మెలోడీస్‌, స్వాతిముత్యం , పుష్పక విమానంతో పాటు సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవ కోన సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తమిళం, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది.