Sobhita : సమంత(Samantha Ruth Prabhu) తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య(Akkineni Nagachaitanya) ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ నాల్గవ తేదీన వీళ్లిద్దరి వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగి, నేటికీ సరిగ్గా రెండు నెలలు పూర్తి నెయ్యి, మూడవ నెల నడుస్తుంది. ఎక్కడికి వెళ్లిన వీళ్లిద్దరు కలిసే వెళ్తున్నారు. శోభిత కూడా చూసేందుకు చాలా మంచి అమ్మాయి లాగ అనిపిస్తుంది. మన హిందూ సంప్రదాయాలకు ఈ అమ్మాయి అమితమైన గౌరవం ఇస్తూ అనేక సందర్భాల్లో కనిపించింది. అక్కినేని అభిమానులు కూడా మొత్తానికి నాగ చైతన్య కి సరైన జోడి దొరికింది అంటూ మురిసిపోతున్నారు. ఇలాంటి సమయంలో శోభిత తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అక్కినేని అభిమానులను షాక్ కి గురి చేసింది. నాగ చైతన్య కోసం, కుటుంబం కోసం ఇంత త్యాగం చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
పూర్తి విషయంలోకి వెళ్తే శోభిత పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్స్ లో ఒకరు. వెబ్ సిరీస్ , సినిమాలు అంటూ ఈమె క్షణకాలం తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోయిన్. రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది. అంత పెద్ద కెరీర్ ని వదులుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఇష్టపడడు. అలాంటిది శోభిత అక్కినేని కుటుంబం కోసం సినిమాలకు ఇక నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. రీసెంట్ గా పలువురు బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు ఈమెని సంప్రదించడానికి రాగా, ఆమె సున్నితంగా తిరస్కరించి పంపేసిందట. నాగ చైతన్య నుండి కానీ, అక్కినేని కుటుంబం నుండి కానీ శోభిత సినిమాల్లో నటించకూడదు అనే కఠినమైన నియమాలేవి పెట్టలేదు. కానీ భవిష్యత్తులో పిల్లల్ని కనే ఉద్దేశ్యం ఉన్నందున సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పిల్లలు పుట్టిన తర్వాత, కొన్నేళ్లు గడిచాక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే నటించేందుకు ఆలోచిస్తానని చెప్పిందట.
పిల్లల్ని కంటే తమ గ్లామర్ చెడిపోతుందో, సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అనే భయం తో విడాకులు తీసుకోవడానికి సిద్దపడే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో, ఇలా పిల్లల కోసం, కుటుంబం కోసం కెరీర్ ని వదులుకున్న అమ్మాయిలు ఉంటారా అంటే ఆశ్చర్యంగా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు సంప్రదాయాలు తెలిసిన అమ్మాయిల పద్దతే వేరంటూ శోభిత ని మెచ్చుకుంటున్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత నాగ చైతన్య నుండి వచ్చిన ‘తండేల్'(Thandel Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ముందు నాగచైతన్య కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. కేవలం నాగ చైతన్య మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ మొత్తం డిజాస్టర్ ఫేస్ లోనే ఉంది. తండేల్ చిత్రం ఒక్కసారిగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు నాగచైతన్య. ఇది శోభిత ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన శుభ పరిణామం అని అభిమానులు అంటున్నారు.