కల్కి 2 కోసం నాగ్ అశ్విన్ బిగ్ స్కెచ్.. ఏకంగా 3 సినిమాలతో సమానం

www.mannamweb.com


బాహుబలి పేరు ఎత్తకుండా సిక్వెల్ గురించి డిస్కషన్ ఎండ్ చేయలేము. అప్పటినుంచే కథను రెండు పార్ట్స్ గా చెప్పే సంప్రదాయం మొదలైంది. బాహుబలి తర్వాత వచ్చిన పాన్ ఇండియా చిత్రాలన్నీ కూడా సిక్వెల్స్ ప్లాన్ తోనే థియేటర్ లో అడుగుపెట్టాయి. సలార్, కల్కి , దేవర లాంటి సినిమాలన్నిటికి కూడా సెకండ్ పార్ట్ మిగిలే ఉంది. వీటిలో భారీ అంచనాలతో ఉన్న సిక్వెల్ అంటే అది కల్కి2 నే.
ఇక ఈ ఏడాది జూలై లో విడుదలైన కల్కి ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. సో ఇప్పుడు కల్కి 2 మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

కల్కి మూవీ భారీ విజయాన్ని అందుకున్న మాట వాస్తవమే. కానీ.. అభిమానులు మాత్రం ఎక్కడో కాస్త వెలితిగా ఫీల్ అయ్యారు. పార్ట్ 2 ఎలా ఉండబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతు వస్తున్నాయి. కానీ రీసెంట్ గా నాగ్అశ్విన్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. దీనితో సెకండ్ పార్ట్ పై ఉన్న భయాలు , అనుమానాలు పటాపంచలయ్యాయి. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ పాత్ర ఇంకాస్త బలంగా ఉంటుందని.. కథ మొత్తం కూడా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ ఎలాగూ బిజీ బిజీగా ఉన్నాడు. సో కల్కి 2 సినిమా రాడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపు నాగ్ అశ్విన్ మరేదైనా సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నాడా అని సందేహిస్తే.. పొరపాటే.

ఎందుకంటే ఈ ఒక్క కల్కి 2 సినిమా ఏకంగా 3 సినిమాలకు సమానం అని చెప్పుకొచ్చారు.దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 ను ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ , ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఎలాగూ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమాలన్నీ అయిన తర్వాత.. కల్కి 2 గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దాదాపు ఇంకో ఏడాది సమయం పట్టిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా మీదే కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని పరుగులు పెడుతున్నారు రాజాసాబ్ టీం. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.