బుల్లితెరపై అనేక షోలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అయితే కొన్నిటికి మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కొన్ని షోలు సంపాదించుకుంటాయి. అలాంటి వాటిల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. దేశంలోని అనేక భాషల్లో ఈ షో విజయవంతంగా రన్ అవుతోంది. అలానే తెలుగులో కూడా ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ ప్రారంభమయ్యేందుకు సిద్ధమైంది. ఇటీవలే కింగ్ నాగార్జున ఈ షోకు సంబంధించిన లోగో ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రెమ్యూనరేషన్ గురించి ఓ టాక్ వినిపిస్తోంది. గత సీజన్ల కంటే.. ఈ సారీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమచారం.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న వాటిల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను విజయవంతగా పూర్తి చేసింది. ఏడో సీజన్ లో జరిగిన రచ్చ అందరికి తెలిసింది. ఇది ఇలాంటే.. సీజన్ సీజన్ కు ఎంతో ఇంట్రెస్టింగ్ గా షోను రెడీ చేస్తున్నారు మేకర్స్. అందుకే ఈ షో సీజన్లు గడిచే కొద్ది..కొత్త సీజన్ పై ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బిగ్ బాస్ కు సంబంధించిన అప్ డేట్ గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇక గతంలో మాదిరిగానే బిగ్‍బాస్ 8వ సీజన్‍కు కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అయితే, గత సీజన్‍తో పోలిస్తే ఈ కొత్త సీజన్‍కు ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందనే టాక్ బయటికి వచ్చింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ కోసం నాగ్ ఏకంగా రూ.30కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని సమాచారం. 7వ సీజన్ కోసం రూ.20కోట్లను నాగ్ అందుకున్నారు. అయితే, బిగ్ బాస్ సీజన్ 8 కోసం రూ.10కోట్లు అదనంగా అంటే.. రూ.30కోట్లను తీసుకుంటున్నారని టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇక బిగ్ బాస్ లోని పలు సీజన్లకు కింగ్ నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసింది. బిగ్ బాస్ 7వ సీజన్‍లో హోస్టింగ్‍లో కింగ్ నాగ్ దుమ్ముతెలిపిన సంగతి తెలిసింది. తప్పు చేసిన సమయాల్లో కంటెస్టెంట్లను గట్టిగానే నిలదీశారు. అంతకు ముందులా కాకుండా బిగ్ బాస్ 7లో దూకుడైన స్వభావంతో హోస్ట్ చేసి ప్రేక్షకులను నాగ్ మెప్పించారు. బిగ్‍బాస్ 8వ సీజన్‍లోనూ అదే జోష్ కొనసాగిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందని తెలుస్తోంది.